వైద్యులు బతకడన్నారు.. ఇప్పుడు 18వ బర్త్‌డే చేసుకుంటున్నాడు!

1 Oct, 2022 14:43 IST|Sakshi

వాషింగ్టన్‌: ఈ బాలుడిని ప్రపంచ వింతగానే చెప్పుకోవాలి. సాధారణంగా జన్యులోపంతో జన్మించిన పిల్లలు ఎక్కువ కాలం బతకరని వైద్యులు చెబుతుంటారు. రెండు ముఖాలతో జన్మించిన ఈ బాలుడు సైతం ఎంతో కాలం జీవించలేడని వైద్యులు చెప్పేశారు. కానీ, ఈ బాలుడు తనకు ఎదురైవుతున్న సమస్యలన్నింటినీ దాటుకుని ఇప్పుడు 18వ పడిలోకి అడుగుపెట్టాడు. వైద్యుల మాట తప్పు అని నిరూపిస్తూ మెడికల్‌ మిరాకిల్‌ అనిపించుకుంటున్నాడు. ఆ బాలుడే అమెరికాకు చెందిన ట్రెస్‌ జాన్సన్‌. 

అమెరికాలోని మిస్సోరీకి చెందిన ట్రెస్‌ జాన్సన్‌.. రెండు ముఖాలతో జన్మించాడు. ఎస్‌హెచ్‌ఎచ్‌ అనే జన్యు లోపం కారణంగా ఇలా జరిగినట్లు వైద్యులు తెలిపారు. ముఖంపై రెండు ముక్కులు, మూడు కళ్లు, నోటిలోనూ చిలిక.. దాదాపుగా రెండు ముఖాలు ఉన్నాయి. తొలుత చాలా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. అయితే.. అధునాత చికిత్సలతో బాలుడు వేగంగా కోలుకున్నాడు. గంజాయి ఆయిల్‌ తీసుకోవటం ద్వారా ముక్కు కారే సమస్య దాదాపుగా నియంత్రణలోకి వచ్చిందని జాన్సన్‌ తల్లితండ్రులు తెలిపారు. అదే ఆయిల్‌ను గత ఏడేళ్లుగా ఉపయోగిస్తున్నామని చెప్పారు. వింత జబ్బులతో బాధపడుతున్న తన కుమారుడికి ఔషధాల కోసం చాలా ఇబ్బందులు పడ్డామని, ప్రసవం తర్వాత తొలిసారి తన బిడ్డను చూసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు జాన్సన్‌ తల్లి బ్రాండీ. ప్రస్తుతం తన కుమారుడు 18 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించారు.

A post shared by TresMa (@diprosopusdiaries)

ఇదీ చదవండి: విమాన సిబ్బందికి ‘లోదుస్తులు’ కంపల్సరీ.. పాక్‌ ఎయిర్‌లైన్స్‌ నవ్వులపాలు, ఆగ్రహజ్వాలలు

మరిన్ని వార్తలు