దేశాభివృద్ధి పథంలో అమెరికా కీలకపాత్ర

16 Sep, 2022 04:49 IST|Sakshi

అమెరికా పార్లమెంట్‌లో ఆజాదీ కా అమృత్‌ వేడుకలో మోదీ సందేశం

వాషింగ్టన్‌: వచ్చే పాతికేళ్ల భారత అభివృద్ధి పయనంలో అమెరికా కీలక పాత్ర పోషించగలదని ప్రధాని మోదీ అభిలషించారు. అమెరికా పార్లమెంట్‌లో భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు.. ఇరు దేశాల మైత్రీబంధంలో మైలురాయిగా నిలిచిపోవాలని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. వాషింగ్టన్‌లోని యూఎస్‌ క్యాపిటల్‌లో ఆజాదీ అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారతీయ సంతతి అమెరికన్లకు ప్రధాని మోదీ సందేశం పంపారు.

ప్రధాని సందేశంలోని ముఖ్యాంశాలు కొన్ని ఆయన మాటల్లో.. ‘ భారత్‌ అనే పదం వినగానే ఎన్నో అంశాలు స్ఫురిస్తాయి. అధునాతన ప్రజాస్వామ్య దేశం, భిన్నజాతులు, ప్రాచీన నాగరికతల ఇండియాను ప్రపంచం గుర్తుచేసుకుంటుంది. ఇదే రీతిలో భిన్న అంశాల్లో గ్లోబల్‌ ఇండియన్‌తో భారత్‌ మమేకమైంది. వచ్చే పాతికేళ్ల అమృతకాలంలో భారత సుస్థిరాభివృద్ధికి అమెరికా ఎంతగానో సాయపడనుందని భావిస్తున్నా. అమెరికాలో మీరంతా భారత్‌ తరఫున అత్యద్భుతమైన ప్రతినిధులుగా ఉంటారని ఆశిస్తున్నా’ అని మోదీ అన్నారు. యూఎస్‌ ఇండియా రిలేషన్‌షిప్‌ కౌన్సిల్, సేవా ఇంటర్నేషనల్, హిందూ స్వయంసేవా సంఘ్, జీఓపీఐఓ సిలికాన్‌ వ్యాలీ, యూఎస్‌ ఇండియా ఫ్రెండ్‌షిప్‌ కౌన్సిల్, సనాతన్‌ సంస్కృతి సర్దార్‌ పటేల్‌ ఫండ్‌ తదితర 75 భారతీయ అమెరికన్‌ సంఘాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి.

ఇదీ చదవండి: సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు.. సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం

మరిన్ని వార్తలు