వాషింగ్టన్: అమెరికాలో మంకీ పాక్స్ వైరస్ తొలి కేసు నమోదైంది. యూఎస్ అంటువ్యాధుల సంస్థ సీడీసీ గురువారం దీనిని ద్రువీకరించింది. మాసాచుసెట్స్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. బాధితుడు ఇటీవల కెనడాలో పర్యటించినట్లు గుర్తించారు. వైరస్ సోకిన వ్యక్తికి మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతని కాంటాక్స్ట్‌ని గుర్తించే పనిని అధికారులు ముమ్మరం చేశారు. ఇక కెనడాలోని క్యూబెక్ ప్రావిన్సులో డజన్ల సంఖ్యలో వైరస్ కేసులు నమోదయ్యాయి.
చదవండి👉 నిరసనకారులపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్ జారీ చేయలేదు: శ్రీలంక ప్రధాని
మంకీపాక్స్ వైరస్ సోకితే ఫ్లూ లాంటి లక్షణాలతో అస్వస్థత ప్రారంభం అవుతుంది. జ్వరం, వళ్లు నొప్పులు, శరీరంపై మచ్చలు వంటికి కనిపిస్తాయి. ఇక యూరప్‌లోని పలు దేశాల్లో మంకీ పాక్స్ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. యూరప్‌లో మే 6న తొలికేసు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 9 కి చేరింది. ఇక మంకీపాక్స్ బాధితులకు మశూచి మాదిరిగానే లక్షణాలు ఉంటాయని యూకే హెల్త్ సెక్యురిటీ ఏజెన్సీ అధికారులు తెలిపారు. ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని వెల్లడించారు. అయితే, దీని వ్యాప్తి.. వ్యాధి తీవ్రత గురించి అంతగా ఆందోళన పడొద్దని సూచించారు.
చదవండి👉🏾 టీకా వేస్ట్.. ఉప్పు నీళ్లే బెస్ట్