66,000 మంది సైనికులు మృతి.. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు ఇంత భారీ నష్టమా..!

21 Oct, 2022 19:49 IST|Sakshi

కీవ్‌: రష్యాతో 240 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఆ దేశానికి చెందిన 66,750 మంది సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ భీకరు పోరులో శుత్రుదానికి జరిగిన నష్టాన్ని ఓ చిత్రం రూపంలో విడుదల చేసింది. ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధం ఇరు దేశాలకు తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. దాదాపు 9 నెలలు కావస్తున్నా యుద్ధం ఆగే సూచలను కన్పించడం లేదు. ఉక్రెయిన్‌ చెప్పిన వివరాల ప్రకారం ఈ యుద్ధంలో రష్యాకు జరిగిన నష్టం..

  • చనిపోయిన సైనికులు - 66750
  • ధ్వంసమైన యుద్ధ విమానాలు- 269
  • హెలికాప్టర్లు - 263
  • ట్యాంకులు - 2573
  • మానవ రహిత విమానాలు - 1325
  • స్పెషల్ ఎక్విప్‌మెంట్‌ - 147
  • పడవలు - 16
  • సాయుధ వాహనాలు - 5258
  • ఆయుధ వ్యవస్థలు - 1648
  • బహుళ రాకెట్ లాంచర్లు ‌- 372
  • వాహనాలు, ఇంధన ట్యాంకులు - 4006
  • యుద్ధ విమాన నిర్వీర్య వవస్థలు - 189
  • క్రూజ్ క్షిపణులు - 329

ప్రపంచానికే సంక్షోభం తెచ్చేలా ఉన్న ఈ భీకర యుద్ధాన్ని ఆపాలని అ‍న్ని దేశాలు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ రష్యా, ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం ఆపే ప్రసక్తే లేదని పుతిన్‌ చెబుతున్నారు. జెలెన్‌స్కీ కూడా రష్యాతో చర్చలకు ససేమిరా అంటున్నారు.
చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. ఐదేళ్లు వేటు

మరిన్ని వార్తలు