కరోనా : మోడర్నా మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది

30 Nov, 2020 19:07 IST|Sakshi

తమ  వ్యాక్సిన్‌ 100 శాతం సమర్ధవంతం

అత్యవసర వినియోగానికి దరఖాస్తు

డిసెంబరులో  అనుమతి రావచ్చు  :  మోడెర్నా

కరోనా వైరస్‌  వ్యాక్సిన్ ప్రయోగాల్లో వరుస సానుకూల ఫలితాలు భారీ ఊరటనిస్తున్నాయి.తాజాగా  అమెరికాకు బయోటెక్ దిగ్గజం మోడర్నా తన కోవిడ్-19 వ్యాక్సిన్‌ ప్రయోగాలకు సంబంధించి కొత్త డేటాను  సోమవారం విడుదల చేసింది. తమ టీకా 94 శాతం ప్రభావవంతంగా ఉందని,  తీవ్రమైన అనారోగ్యం నుండి సురక్షితంగా కాపాడుతుందని వెల్లడించింది. తీవ్రమైన కరోనా వైరస్‌ను నివారించడంలో 100 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు కనిపిస్తోందని మోడెర్నా తెలిపింది.

సుమారు 30,000 మంది వాలంటీర్లపై చేసిన అధ్యయనంలో  ఈ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొంది. ఈ తాజా ఫలితాల ఆధారంగా,  ఈ రోజే అమెరికా , యూరోపియన్‌ దేశాల్లో అత్యవసర వినియోగంకోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయాలని కంపెనీ యోచిస్తోంది. అంతేకాదు రానున్న వారల్లో తమకు అనుమతి లభించనుందనే విశ్వాసాన్ని కంపెనీ అధ్యక్షుడు డాక్టర్ స్టీఫెన్ హోగ్ వ్యక్తం చేశారు. ఈ డేటాపై చర్చించడానికి డిసెంబర్ 17న ఎప్‌డీఏ సిద్ధంగా ఉంటుందని మోడర్నా ఆశిస్తోంది. అనంతరం తుది ఆమోదం లభిస్తుందని భావిస్తోంది.  దీంతో  పంపిణీ పరిమితంగా ఉన్నప్పటికీ, ఫైజర్,  మోడర్నా టీకాలు రెండూ డిసెంబర్ మధ్య నుండే అందుబాటులోకి రావచ్చని అంచనా. ఫైజర్‌‌, మోడర్నా వంటి కంపెనీలు డెవలప్‌‌ చేసిన వ్యాక్సిన్ల ప్రయోగాలు చివరి దశలలో ఉన్నసంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు