వీడియో: శిథిలాల కిందే ప్రసవం.. చావుపుట్టుకల ఆట గదరా శివ!

7 Feb, 2023 10:34 IST|Sakshi

పుట్టుక.. మరణం.. రెండూ రక్తంతో కూడుకున్నవే. అందునా ప్రకృతి ప్రకోపంతో కన్నెర జేస్తే ఫలితం ఎలా ఉంటుందో తాజా భూకంపాలను చూస్తే సుస్పష్టమవుతుంది. అయితే.. లయకారుడి తాండవంతో సృష్టి వినాశనానికి మాత్రమే కాదు చావుపుట్టుకలకి కూడా కారణమని ప్రతీతి. అందునా కష్టకాలంలోనూ వెలుగు రేఖను ప్రసరించే ప్రయత్నం చేశాడేమో!. శిథిలాల కిందే బిడ్డను ప్రసవించి కన్నుమూసిందో కన్నతల్లి. 

మూగబోయిన సెల్‌ఫోన్లు.. మంచు కురిసేంత చలికి వణికిపోతూ చేతికి దొరికిన పేపర్లను, అట్ట ముక్కలను, కవర్లను కాల్చుతూ చలి మంట కాచుకుంటున్నారు భూకంప బాధితులు. టర్కీ, సిరియాలో ఎటు చూసినా భవనాల శిథిలాలు.. శవాల దిబ్బలను తలపిస్తున్నాయి.   సోషల్‌ మీడియాలో ఎటు చూసినా భూకంపాలకు సంబంధించిన దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. తమవంతుగా సహాయక చర్యల్లో స్థానికులు సైతం పాల్గొని.. ఎందరినో కాపాడుతున్నారు. తాజాగా..

సిరియా అలెప్పోలో ఓ తల్లి బిడ్డను ప్రసవించింది. అదీ శిథిలాల కిందే!. దురదృష్టం కొద్దీ ప్రసవించిన వెంటనే ఆ తల్లి కన్నుమూసింది. శిథిలాల తొలగింపు క్రమంలో ఇది గమనించిన స్థానికులు.. ఆ బిడ్డను హుటాహుటిన వైద్యం కోసం తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ పరిస్థితి నిలకబడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో సిరియాదే అయినా. టర్కీలోనిది అనే ప్రచారం కూడా నడస్తుండడం గమనార్హం.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు