వీడియో: కన్నా.. వద్దు రా.. వాళ్లసలే మనుషులు! ఆ తల్లి భయం అలాంటిది

5 Sep, 2022 19:55 IST|Sakshi

వైరల్‌: నేటి పరిస్థితుల్లో.. సమాజంలో మనిషికి మనిషే శత్రువు. ఇంకా చెప్పాలంటే నోరు లేని జీవులే ఈ విషయంలో ఎంతో నయం. కనీసం అవి గుంపుగా బతుకుతున్నాయ్‌ అన్నాడు ఓ రచయిత. అయితే తన స్వార్థం కోసం మూగజీవాలను బలి తీసుకుంటున్న పరిస్థితుల్లో..  మనుషుల పట్ల అవి అప్రమత్తంగా ఉండడంలో ఏమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. 

జనావాసాల్లోకి వచ్చే మూగజీవుల పట్ల మనుషులు వ్యవహరించే తీరే అందుకు నిదర్శనం కూడా. ఒక్కోసారి వాటి మానానా అవి వెళ్తున్నా కూడా వెంటపడి మరీ వేధించడం, హింసించడం, విషాదకరమైన ఘటనలూ చూస్తున్నాం. అయితే..

ఏనుగులంటే సాధారణంగా.. కాస్త బుద్ధిజీవులు. ఒక్కోసారి వాటి తెలివి తేటలు ఆశ్చర్యపరుస్తుంటాయి. ఆకలి తీర్చుకునే విషయంలోనే కాదు.. మిగతా విషయాల్లోనూ గజరాజుల బుర్రే బుర్ర.  గుంపులుగా జీవిస్తూ.. ఒక్కోసారి ప్రమాదాలను ముందుగా పసిగడుతుంటాయి. అందుకేనేమో..

ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ అవుతోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓ జాతీయ ఉద్యానవనంలో.. ఏ తల్లి ఏనుగు.. గున్న ఏనుగులు రోడ్డు దాటుతున్నాయి. ఇంతలో అక్కడే ఆగి ఉన్న టూరిస్టుల వాహనం వైపు గున్నేగును అడుగులు వేసింది. అది చూసి.. ఆ తల్లి ఏనుగు ఎక్కడికి వెళ్తావ్‌ అన్నట్లుగా వెనక్కి లాగేసుకుంది. పాతదా? కొత్తదా? ఎక్కడ జరిగింది అనే క్లారిటీ లేదు.. కానీ, మిలియన్నర వ్యూస్‌తో ప్రస్తుతం ఈ వీడియో ట్విటర్‌ ద్వారా వైరల్‌ అవుతోంది. 


ఇదీ చదవండి: తలకిందులుగా ఇరుక్కుపోయిన మహిళ, ఆ తర్వాత ఏమైందంటే..

మరిన్ని వార్తలు