100మంది పిల్లల్ని కనాలని కోరిక

15 Feb, 2021 18:30 IST|Sakshi

మాస్కో: రష్యాకు చెందిన క్రిస్టినా ఓజ్టూర్క్ అనే 23 ఏళ్ల మహిళకు పిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పటికే 11 మంది పిల్లలున్నా ఇంకా పిల్లలు కావాలని కోరుకుంటుంది. 100మందికి పైగా పిల్లల్ని కని, తన కుటుంబాన్ని విస్తరించాలనుకుంటుంది. జార్జియాకు చెందిన క్రిస్టినా ఓజ్టూర్క్- గల్లిప్ ఓజ్టర్క్ దంపతులు రష్యాలో పేరున్న కోటీశ్వరులు. వీరికి రష్యాలో అత్యంత విలాసవంతమైన రెస్టారెంట్ కూడా ఉంది. అయితే ఈ దంపతులకు ఇప్పటికే 11 మంది పిల్లులు ఉన్నారు.

వారిలో 10మంది సరోగసి పద్ధతి ద్వారా జన్మించినవారే. ఇందుకోసం ఒక్కో సరోగేట్ మదర్‌కు 8వేల యూరోలు (దాదాపు 7లక్షలు)అందించామని గల్లిప్ తెలిపారు. అయితే ఇక్కడితో ఆగిపోకుండా మొత్తం 100మందికి పైగా పిల్నల్నికనాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. తన భార్య క్రిస్టీనా అంటే తనకెంతో ఇష్టమని, ఆమెకు పిల్లలంటే అమితమైన ప్రేమ గల్లిప్ చెప్పారు. ఆమె కోరికను నెరవేర్చడం కోసమే సరోగసి విధానాన్ని ఎంచుకున్నామని వివరించారు. ఇక 1997 లో జార్జియాలో సర్రోగసీని చట్టబద్దం చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి : (ప్రియాంకకు ఏకంగా క్రికెట్‌ టీమే కావాలట!)
               (శుభవార్త చెప్పిన మేఘన్‌ మార్కెల్‌ )

మరిన్ని వార్తలు