ప్రతి ఇంట్లో అమ్మ పరిస్థితి ఇలాగే ఉంటదేమో

5 May, 2021 13:31 IST|Sakshi

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ .. కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగమ్మా అంటూ తల్లి ప్రేమను కవులు, రచయితలు మాతృమూర్తి గొప్పతనాన్ని చాటారు. దేశానికి రాజైనా తల్లికి బిడ్డే. ఉన్నత శిఖరానికి ఎదిగినా.. అమ్మకు ఆ బిడ్డ పోత్తిళ్లలోని వాడే. అమ్మ ప్రేమకు హద్దులుండవు. తల్లికి మించిన గొప్ప గురువు ఇంకెవ్వరూ ఉండరు అనేది జగమెరికగిన సత్యం. ఇలా అమ్మ గొప్ప తనం గురించి  ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడనైనా స్వార్థం ఉంటుందేమో కానీ అమ్మ ప్రేమలో స్వార్థానికి తావులేదు. అమ్మ ప్రేమంటే ఆకాశమంత.

అలాంటి అమ్మ బండెడు సంసారాన్ని చక‍్కబెడుతు. తన గురించి ఆలోచించడం మానేసి కుటుంబం, పిల్లల కోసం తపిస్తుంది. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఊరుకులు పరుగులు పెడుతుంది. తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకునే తీరిక కూడా ఉండదు. ఇక ఇంట్లో చిన్న పిల్లలు ఉండి.. వారిని చూసుకోవడానికి తల్లి తప్ప ఇంట్లో ఇంకేవరు లేకపోతే.. ఆ పరిస్థితి మరి దారుణం. కనీసం ఆ తల్లికి బాత్రూమ్‌కు వెళ్లడానికి కూడా కుదరదు. రెండు నిమిషాలు తల్లి కనపడకపోతే.. పిల్లలు ఏడుస్తారు. దాంతో చాలా మంది తల్లులు ఏం చేస్తారో తెలిపి ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలో యూకేకి చెందిన ఓ తల్లి కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూంకు వెళ్తుంది. కానీ పిల్లలు ఏడుస్తుండటంతో వారిని కూడా తనతో పాటే వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్తుంది. పిల్లలే అనుకుంటే.. పెంపుడు కుక్క కూడా అలానే చేస్తుంది. ఆమె సీటుపైన కూర్చొని ఉండగా ఆమె ఒళ్లో చిన్నకొడుకు, కింద పెద్ద కొడుకు ఆమె కాళ్లు పట్టుకొని ఏడుస్తున్నాడు. ఎదురుగా చిన్న కుక్కపిల్ల ఉంటుంది.  ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్‌ చేస్తున్నారు. 

ఈ ఫోటోను ప్రతి మదర్స్‌ డే రోజు షేర్‌ చేయాలి.  అమ్మ పడుతున్న కష్టాన్ని అందరికి తెలియజేయాలని ఓ నెటిజన్‌ అంటుంటే..  మరొకరు ఈ ఫోటోను మా అమ్మకి చూపిస్తే ఫోటోని ఫ‍్రేమ్‌ చేయించి అందరికి కనిపించేలా గోడకి తగిలిస్తుంది. అదే ఫోటోను మదర్స్‌ డే రోజు నాకు పంపిస్తుందని కామెంట్‌ చేశాడు. 
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు