ఎవరెస్ట్‌ ఎత్తు పెరిగింది, ఎంతంటే..

8 Dec, 2020 15:51 IST|Sakshi

ఎవరెస్ట్‌ తాజా ఎత్తును ప్రకటించిన నేపాల్‌

ఖాట్మండ్‌ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ ఎత్తును నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. తాజా లెక్కల ప్రకారం ఈ పర్వతం ఎత్తు 8,848.86 మీటర్లు ఉందని తెలిపింది.  2015 భూకంపం తర్వాత ఎత్తు మారి ఉంటుందన్న సందేహాల నేపథ్యంలో నేపాల్‌ ప్రభుత్వం 2017లో ఎవరెస్టు ఎత్తును కొలిచే ప్రక్రియ ప్రారంభించింది. దీని కోసం నేపాల్ సర్కారు చైనా సాయం తీసుకుంది.
(చదవండి : చైనా సంచలనం; సూర్యుడి ప్రతిసృష్టి!)

చైనా సహకారంతో నిర్మించిన సర్వేల ద్వారా ఎవరెస్ట్ ఎత్తులో ఎలాంటి తరుగుదల చోటుచేసుకోలేదని వెల్లడైంది. ఎవరెస్ట్ శిఖరం తాజా ఎత్తు 8,848.86 మీటర్లు అని నేపాల్ ప్రభుత్వం తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ పర్వతం ఎత్తును భారత ప్రభుత్వం 1954లో కొలిచినపుడు 8,848 మీటర్లు అని నిర్థరణ అయింది. ప్రపంచవ్యాప్తంగా దీనినే విస్తృతంగా ఆమోదిస్తున్నారు. తాజాగా నేపాల్‌ సర్వేలో ఎవరెస్ట్‌ ఎత్తు 0.86 మీటర్లు పెరిగిందని, ప్రస్తుతం దాని ఎత్తు 8,848.86 మీటర్లకు చేరిందని ప్రకటించాయి. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్, చైనా మంత్రి వాంగ్ యి వర్చువల్ కార్యక్రమంలో ఈ వివరాలను ప్రకటించారు.

మరిన్ని వార్తలు