కరోనాతో బిషప్ మృతి, మృతదేహానికి ముద్దులు

3 Nov, 2020 14:38 IST|Sakshi

 పోడ్గోరికా: మాంటెనెగ్రోలో బిషప్‌ అమ్ఫిలోహిజే రాడోవిక్ పార్థీవదేహాన్ని  సందర్శించే సమయంలో చాలా మంది కోవిడ్-19‌ భద్రతా నియమాలను విస్మరించారు. బిషప్ అమ్ఫిలోహిజే రాడోవిక్  చివరి అంత్యక్రియలను ఆదివారం  పోడ్గోరికాలోని సెర్బియన్ ఆర్థోడాక్స్ కేథడ్రాల్‌లో నిర్వహించారు. అయితే ఆయనను చూడటానికి వచ్చిన వారిలో చాలా మంది ఆయన గౌరవార్థం ఆయన చేతిపై, నుదిటిపై మాస్క్‌లు లేకుండానే ముద్దులు పెట్టారు. ఈ విషయం గురించి బిషప్‌కు చికిత్సనందించిన డాక్టర్‌ మాట్లాడుతూ, ముందు ఆయన పార్థీవదేహాన్ని అలా తెరచి పెట్టకుండా నిషేధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఆయన శరీరంపై కరోనా వైరస్‌ ఒక పొరలా ఉంటుందని వివరించారు. ఇప్పటికే ఈ చిన్న దేశంలో మూడు వంతుల మంది దాదాపు ఆరు లక్షలకు పైగా కోవిడ్‌-19 బారిన పడ్డారు. 

ఇక బిషప్‌ అమ్ఫిలోహిజే రాడోవిక్ విషయానికి వస్తే ప్రస్తుతం దేశ అధ్యక్షుడిగా ఉన్న  డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ సోషలిస్ట్‌ నేత మిలో జుకానోవిక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని గట్టిగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో జరిగే ఎన్నకల ప్రచారంలో డీపీఎస్‌కు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారు. బిషప్ అమ్ఫిలోహిజే, పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకి, మోంటెనిగ్రో నుంచి సెర్బియా విడిపోవడాన్ని ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల ఆయన మాస్క్‌ లేకుండా తిరిగారు. సామాజిక దూరం పాటించకుండా చాలా మందిని కలిశారు. దీంతో ఆయన కరోనా బారిన పడి శుక్రవారం నాడు మరణించారు. ఇప్పుడు ఆయనకు కడసారి వీడోల్కు పలకడానికి వచ్చిన వారు కూడా కరోనా నియమాలు పాటించకుండా మాస్క్‌లు లేకుండా ఆయన మృతదేహాన్ని తాకుతూ ముద్దులు పెట్టడం చర్చనీయ అంశంగా మారింది.  

చదవండి: జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌ ఫేజ్‌-2 పూర్తి

మరిన్ని వార్తలు