షాకింగ్.. ఆ కరోనా టీకాలు తీసుకున్న వారికి గుండెపోటు ముప్పు!

8 Oct, 2022 11:28 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా ఎంఆర్ఎన్‌ఏ టీకాలకు తీసుకుంటే 18-39 ఏళ్ల వయసు వారికి గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువ ఉందని అమెరికా ఫ్లోరిడా సర్జన్ జనరల్ డా.జోసెఫ్ లడాపో వెల్లడించారు.  ఫ్లోరిడా ఆరోగ్య శాఖ స్వయం నియంత్రిత కేసులపై(సెల్ఫ్ కంట్రోల్డ్ కేసెస్ సిరీస్‌) పరిశోధనలు జరిపిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఆయన చెప్పారు. టీకాల భద్రతను పరీక్షించేందుకు ఈ సాంకేతికతనే ఉపయోగించడం గమనార్హం.

ఎంఆర్ఎన్‌ఏ కరోనా టీకా తీసుకున్న 28 రోజుల తర్వాత 18-39ఏళ్ల యువకుల్లో గుండెపోటు, ఇతర హృదయ సమస్యల కారణంగా మరణం సంభవించే ముప్పు 84శాతం ఉంటుందని ఈ విశ్లేషణలో  తేలింది. అగ్ర దేశాలన్నీ ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లనే పంపిణీ చేసిన నేపథ్యంలో ఈ పరిశోధన ఆందోళన కల్గిస్తోంది.  అయితే ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక ఉపయోగించని ఇతర కరోనా టీకాల వల్ల ఈ ముప్పు లేదని పరిశోధన స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని డా.జోసెఫ్ సూచించారు. ముఖ్యంగా మ్యోకార్డిటిస్, పెరికార్డిటిస్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ వ్యాక్సిన్ల పట్ల అప్రమత్తతో ఉండాలని చెప్పారు.

ఏ ఔషధాన్నైనా, వ్యాక్సిన్‌నైనా అభివృద్ధి చేసేటప్పుడు వాటి భద్రత, సమర్థతపై పరిశోధనలు అత్యంత కీలకమని డా.జోసెఫ్ పేర్కొన్నారు. కరోనా టీకాల వచ్చినప్పుడు ఎన్నో ఆందోళనలు వ్యక్తమయ్యాయని, కానీ వాటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించలేదన్నారు. ఇప్పుడు నిర్వహించిన కీలక అధ్యయనం తర్వాతైనా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

అయితే భారత్‌లో ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికత ఉపయోగించిన టీకాలు వినియోగంలో లేవు. సంప్రదాయ పద్ధతిలో అభివృద్ధి చేసిన కరోనా టీకాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన  విషయం తెలిసిందే.
చదవండి: పారేద్దామనుకున్న టికెట్‌కు 1.6 కోట్లొచ్చాయి

మరిన్ని వార్తలు