కస్టమర్‌కి చేదు అనుభవం... అలా వచ్చాడని టికెట్టు ఇవ్వనన్న మల్టీప్లెక్స్‌ థియేటర్‌

5 Aug, 2022 19:39 IST|Sakshi

ఇటీవల చిన్న పెద్ద అంతా బయటకు వస్తే కచ్చితం ఫ్యాంట్‌ షర్టు లేదా షార్ట్స్‌ వంటి ఇతర ఫ్యాషెన్‌ డ్రెస్‌లను ధరంచడం పరిపాటిగా మారింది. ప్రస్తు​తం ట్రెండ్‌ కూడా అదే. ఐతే ఎవరైన సంప్రదాయబద్ధమైన డ్రస్‌లు వేసుకుంటే నోరెళ్లబెట్టడమే కాకుండా రావద్దంటూ నిరాకరిస్తున్నారు. ఏదో చేయరాని నేరం చేసినట్లు చూడటం వంటివి చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక బంగ్లాదేశ్‌ వ్యక్తి సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చినందుకు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత క్షమాపణలు చెప్పించుకుని తగిన గౌరవాన్ని పొందాడు 

బంగ్లాదేశ్‌లోని సమాన్‌ అలీ సర్కార్‌ అనే వృద్ధుడు మల్టీప్లెక్స్‌ థియేటర్‌కి లుంగీతో వచ్చాడు. అతను బంగ్లదేశ్‌ రాజధాని సోనీ స్క్వేర్‌ బ్రాంచ్‌లో ఉన్న మల్టీపెక్స్‌ థియేటర్‌లో 'పురాణ్‌' అనే ప్రముఖ సినిమాను వీక్షించేందుకు వచ్చాడు. ఐతే థియోటర్‌ వాళ్లు అతని వేషధారణ చూసి సినిమా టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ విషయం కాస్త సోషల్‌ మాధ్యమంలో పెద్ద దూమారం రేపింది.

దురదృష్టవశాత్తు సదరు మల్టీప్లెక్స్‌ పై వ్యతిరేక భావన ఏర్పడటమే గాకుండా నెటజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు మల్టీప్లెక్స్‌ థియేటర్‌ వెంటనే అప్రమత్తమై సరిచేసుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మల్టీప్లెక్స్‌ థియేటర్‌ యాజమాన్యం జరిగిన దానికి వివరణ ఇస్తూ...సదరు వ్యక్తి సమాన్‌ అలీని, అతని కుటుంబాన్ని సినిమా చూసేందుకు థియోటర్‌కి ఆహ్వానించడమే కాకుండా వారితో తీసుకన్న ఫోటోలను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రతి ఒక్కరూ మల్టీప్లెక్స్‌ థియేటర్‌కి వచ్చి సినిమా చూడొచ్చు అని, థియేటర్‌కి ఇలానే రావాలనే పాలసీ ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వారు రెడీ అయ్యి రావచ్చు అని సదరు థియేటర్‌ యజమాన్యం వివరణ ఇచ్చుకుంది.

(చదవండి: తప్పులు సరిదిద్దుకోండి!... కెనడాకి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన చైనా)

మరిన్ని వార్తలు