అమెరికా జర్నలిస్ట్‌కి 11 ఏళ్లు జైలు శిక్ష

12 Nov, 2021 14:12 IST|Sakshi

మయన్మార్‌: మయన్మార్ జుంటా కోర్టు అమెరికన్ జర్నలిస్ట్‌ డానీ ఫెన్‌స్టర్‌కు చట్టవిరుద్ధమైన పనులు, మిలిటరీని రెచ్చగొట్టేల చేయడం, వీసా నిబంధనలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలతో 11 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించినట్లు పేర్కొంది. గత ఫిబ్రవరి నుంచి మయన్మార్‌ మిలటరీ బలాగాలు తిరుగాబాటు ధోరణితో డజన్ల కొద్దీ జర్నలిస్టులను అరెస్టు చేసి ప్రెస్‌ని అణిచివేస్తుందన్న సంగతి తెలిసిందే.

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్‌ బేబిగా గిన్నిస్‌ రికార్డ్‌)

అయితే డానీ ఫెన్‌స్టర్ స్థానిక మయన్మార్‌లోని అవుట్‌లెట్ ఫ్రాంటియర్ పత్రికలో ఒక ఏడాది నుంచి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో  అతను తన కుటుంబాన్ని చూడటానికై దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మయన్మార్‌ మిలటరీ అతన్ని అరెస్టు చేసింది. ఈ మేరకు ఫ్రాంటియర్ పత్రిక తమ సంస్థలో మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేసిన డానీ ఫెన్‌స్టర్‌ను ఇలా మూడు ఆరోపణలతో దోషిగా నిర్ధారించి 11 సంవత్సరాల జైలు శిక్ష విధించడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ఫెన్‌స్టర్‌ నిర్భందించినప్పటి నుంచి జీవితాంతం జైలు శిక్ష విధించేలా దేశద్రోహం, తీవ్రవాదం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నాడంటూ పేర్కొంది. అంతేకాదు తాము ఫెన్‌స్టర్‌ వీలైనంత త్వరగా విడుదలై తమ కుటుంబాన్ని చూడటానికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు ఫ్రాంటియర్ మయన్మార్ తెలిపింది. ఈ మేరకు క్రైసిస్ గ్రూప్ మయన్మార్ సీనియర్ అడ్వైజర్ రిచర్డ్ హార్సీ  మిలటరీ చేస్తున్న ఈ పనిని "దౌర్జన్యం"గా అభివర్ణించారు.

ఈ సంఘటన వాస్తవిక పరిస్థితులు గురించి వివరిస్తే ఇలానే చాలా ఏళ్లు జైలు శిక్ష విధించడం జరుగుతుందనేలా అంతర్జాతీయ జర్నలిస్టులకు మాత్రమే కాక మయన్మార్ జర్నలిస్టులకు కూడా పరోక్షంగా సందేశాన్ని ఇచ్చిందన్నారు. అంతేకాదు ఫెన్‌స్టర్‌ని విడుదల చేసేందుకు  అమెరికా దౌత్యవేత్తలు కృషి చేస్తున్నారని సీనియర్ అడ్వైజర్ రిచర్డ్ పేర్కొన్నారు. ఈ సమస్య  కచ్చితంగా దౌత్య మార్గాల ద్వారా పరిష్కారమవుతుందంటూ రిచర్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

(చదవండి: తప్పించుకునే ప్రయత్నంలో దూకేశాడు..అంతే చివరికి!!)

మరిన్ని వార్తలు