Myanmar: గ్రామంపై బాంబుల వర్షం

29 Mar, 2021 04:15 IST|Sakshi

మయన్మార్‌: మయన్మార్‌లో మిలటరీ, ప్రజల మధ్య జరుగుతున్న పోరు కారణంగా ఉద్రిక్త పరిస్థితులు చెలరేగుతూ ఉండటంతో అది అంతర్యుద్ధానికి దారి తీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిలటరీ అరాచకాలకు నిరసనగా వేలాదిమంది రోడ్లపైకి వస్తున్నారు. కాగా, కేఎన్‌యూ సాయుధ సంస్థ నియంత్రణలో ఉన్న గ్రామంపై సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినట్లు స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.

గ్రామంపై మయన్మార్‌ ఆర్మీ బాంబుల వర్షం
యాంగాన్‌: మయన్మార్‌లో మిలటరీ  కరేన్‌ నేషనల్‌ యూనియన్‌ (కేఎన్‌యూ) సాయుధ సంస్థ నియంత్రణలో ఉన్న గ్రామంపై బాంబుల వర్షం కురిపించింది.  మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనకారులు ఆదివారం రోడ్లపైకి వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిం చాలని నినదించారు.  మరోవైపు థాయ్‌ సరిహద్దుల్లోని గ్రామంపై మయన్మార్‌ మిలటరీ ప్రతీకార దాడులకు దిగింది.  పపూన్‌ జిల్లాలో ఓ గ్రామంపై వైమానిక దాడులు చేసి బాంబుల వర్షం కురిపించింది. దీంతో  గ్రామస్తులు ప్రాణాలరచేతుల్లో పట్టుకొని పరుగులు తీశారు. ఈ దాడిలో పిల్లలు సహా పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఓ సంస్థ వెల్లడించింది.  కేఎన్‌యూకి చెందిన కొంతమంది శనివారం ఒక ఆర్మీ బేస్‌పై దాడి చేసి లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ సహా 10  మంది సైనికుల్ని చంపేశారు. ప్రతీకారంగా సైన్యం ఈ దాడి చేసింది. 


యాంగాన్‌లో రోడ్లపై ప్రజాస్వామ్యవాదులు ఏర్పాటు చేసిన అడ్డంకులు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు