ఓ అజ్ఞాత వాసి నీ వివరాలు పంపు!

10 Dec, 2020 14:39 IST|Sakshi
సెయింట్‌ లియోనార్డ్‌ టవర్‌కు చెందిన తాళం చెవి, అజ్ఞాత వ్యక్తి రాసిన లేఖ, సెయింట్‌ లియోనార్డ్‌ టవర్‌

లండన్‌ : 50 ఏళ్ల క్రితం పోయిన ఓ పురాతన భవనానికి చెందిన తాళం చెవి మళ్లీ వెనక్కు వచ్చింది. 1973 తాళం చెవిని తీసుకెళ్లిన?? వ్యక్తి 2020లో క్షమాపణ లేఖతో సహా దాన్ని భవన నిర్వాహకులకు పంపాడు. ఈ వింత సంఘటన ఇంగ్లాండ్‌లోని కెంట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కెంట్‌లోని పదకొండవ శాతాబ్దానికి చెందిన సెయింట్‌ లియోనార్డ్‌ టవర్‌కు చెందిన తాళం చెవి 50 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయింది. కొద్దిరోజుల క్రితం భవన నిర్వాహకులకు ఓ పార్శిల్‌ వచ్చింది. ఆ పార్శిల్‌లో ఈ తాళం చెవి ఉంది. దానితో పాటు ఓ క్షమాపణ లేఖ కూడా ఉంది. ( హవ్వా!! పిచ్చి పనికి గిన్నిస్‌ రికార్డా..)

‘‘ ప్రియమైన ఇంగ్లీష్‌ హెరిటేజ్‌.. సెయింట్‌ లియోనార్డ్‌ టవర్‌కు చెందిన తాళం చెవిని తీసుకోండి. దీన్ని నేను 1973లో తీసుకున్నాను. 2020లో తిరిగిస్తున్నాను. ఆలస్యం అయినందుకు క్షమించండి!’’ అని ఆ లేఖలో ఉంది. దీనిపై పురాతన భవనాలను నిర్వహిస్తున్న చారిటీ సంస్థ ఇంగ్లీష్‌ హెరిటేజ్‌ బుధవారం ట్విటర్‌ వేదికగా స్పందించింది.. ‘‘50 ఏళ్ల క్రితం నువ్వు తీసుకున్న తాళం చెవిని ఇప్పుడు తిరిగివ్వటం దారుణం. సెయింట్‌ లియోనార్డ్‌ టవర్‌కు చెందిన తాళం చెవిని తిరిగిచ్చేసిన అజ్ఞాత వ్యక్తికి కృతజ్ఞతలు. ఆలస్యం అయిందని చింతించకండి! వాటి తాళాలను ఎప్పుడో మార్చేశాము.’’ అని పేర్కొంది. ‘‘తాళం చెవి పంపిన ఓ అజ్ఞాత వాసి.. నీ వివరాలను కూడా పంపు’’ అని కోరింది.

మరిన్ని వార్తలు