నగ్నంగా రోడ్లపై పరుగులు పెట్టిన వ్యక్తి

27 Jan, 2021 14:32 IST|Sakshi

లండన్‌: 'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' అన్నట్లుగా ఓ వ్యక్తి ఒంటి మీద నూలుగు పోగు లేకుండా బజార్ల వెంట నడిచాడు. అతడి వాలకం చూసి నిర్ఘాంతులయ్యారు లండన్‌ ప్రజలు. 'మై లండన్‌' పేర్కొన్న వివరాల ప్రకారం జనవరి 24న లండన్‌లో ఓ వ్యక్తి నగ్నంగా బ్రిటీష్‌ మ్యూజియమ్‌ చుట్టూ చక్కర్లు కొట్టాడు. ఆ ప్రదేశంలోనే పరుగులు తీస్తూ జనాలను ఠారెత్తించాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగగా సదరు వ్యక్తి అక్కడ నుంచి పరారయ్యాడు. (చదవండి: వైరల్: వెనకాల కాదురా.. దమ్ముంటే పులికి ఎదురుపడు!)

ఈ ఘటన గురించి ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. 'సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో నేను రోడ్ల మీద వాకింగ్‌ చేస్తున్నాను. అప్పుడు ఓ వ్యక్తి నగ్నంగా నడుస్తూ తారసపడ్డాడు. అతడు పరుగులు పెడుతున్నట్లుగా వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. అక్కడున్న చాలామంది అతడిని చూసి షాకయ్యారు. ఓ గార్డెన్‌ వరకు వెళ్లిన అతడు తిరిగి మళ్లీ మ్యూజియం వైపు నడక సాగించాడు' అని చెప్పుకొచ్చాడు. మరో ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. 'ఎందుకీ అవతారంలో బయటకు వచ్చావని అతడిని అడిగాను. దానికాయన బదులిస్తూ.. నా బట్టలు నేను ఉతుక్కోవడం కోసం ఒంటి మీదున్నవి తీసేశాను. ఆ తర్వాత కాసేపు అలా నడుద్దామని వచ్చానని చెప్పాడు' అని తెలిపాడు. రోడ్లపై బట్టలు లేకుండా ఇష్టారాజ్యంగా తిరిగిన సదరు వ్యక్తి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. (చదవండి: ఓ మై గాడ్..‌ వీరిద్దరూ ఎంత ముద్దుగా ఉన్నారు!)

మరిన్ని వార్తలు