హైటెన్షన్‌.. తైవాన్‌లో నాన్సీ పెలోసీ.. రెచ్చగొట్టేలా ట్వీట్లు.. పరిణామాలపై చైనా హెచ్చరిక

2 Aug, 2022 21:15 IST|Sakshi

తైపీ/బీజింగ్‌: తీవ్ర ఉద్రిక్తతల నడుమ తైవాన్‌లో అడుగుపెట్టారు అమెరికా సెనేట్‌  స్పీకర్‌ నాన్సీ పెలోసీ. తైపీ ఎయిర్‌పోర్ట్‌లో భారత కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి దిగిన ఆమెకు సాదర స్వాగతలం లభించింది. అయితే దిగీదిగంగానే ఆమె చేసిన ట్వీట్లు.. చైనాను రెచ్చగొట్టేలా ఉన్నాయి. 

అమెరికా ముందు నుంచి చెప్తున్నట్లు తైవాన్‌ ప్రజాస్వామ్యానికి మద్దతుగా, అలాగే ఇండో-ఫసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛకు మేం కట్టుబడి ఉంటామని ఆమె ట్వీట్లు చేశారు. మరోవైపు నాన్సీ పెలోసీ ల్యాండ్‌ అయిన విషయం తెలుసుకున్న చైనా.. జరగబోయే పరిణామాలన్నింటికి అమెరికానే కారణమంటూ ప్రకటించింది. 

ఇప్పటికే చైనా-తైవాన్‌ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే ఉంటుంది. చైనా తీవ్ర అభ్యంతరాలు, హెచ్చరికల నడుమే తైవాన్‌లో అడుగుపెట్టారు యూఎస్‌ హౌజ్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ. మొదటి నుంచి ఆమె పర్యటనను వ్యతిరేకిస్తున్న చైనా.. తాజాగా తైవాన్‌ భూ భాగంలోకి ఫైటర్‌ జెట్స్‌ను ప్రయోగించింది. అంతేకాదు తైవాన్‌ ప్రభుత్వ వెబ్‌సైట్లను సైతం హ్యాక్‌ చేసింది. 

ట్రెండింగ్‌లో వరల్డ్‌వార్‌ త్రీ
తైవాన్‌-చైనా ఉద్రిక్తతల నడుమ యుద్ధ వాతావరణం నెలకొనడంతో మూడో ప్రపంచ యుద్ధం అంటూ ట్విటర్‌ ట్రెండ్‌ నడుస్తోంది.  స్వీయ పరిపాలన ఉన్న తైవాన్‌ను తమ సొంతంగా ప్రకటించుకుంది చైనా. అలాగే.. పెలోసీ పర్యటన తమ(చైనా) తైవాన్‌ పర్యటన.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని, చైనా ఆర్మీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించింది.

తైవాన్‌ పర్యటన తర్వాత..  సింగపూర్‌, మలేషియా, జపాన్‌, సౌత్‌ కొరియాలోనూ ఆమె పర్యటించనున్నారు.

మరిన్ని వార్తలు