నాసా అర్టెమిస్‌-1 ప్ర‌యోగం మ‌ళ్లీ వాయిదా, కారణం ఏంటంటే..

3 Sep, 2022 21:27 IST|Sakshi

తల్లాహస్సీ: అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ నాసా ప్ర‌యోగించ‌త‌ల‌పెట్టిన ఆర్టెమిస్‌-1 మ‌రోమారు వాయిదా ప‌డింది. చంద్రుడిపైకి వ్యోమ‌గాముల‌ను పంపేందుకు ఉద్దేశించిన ఈ ప్ర‌యోగం ఇప్ప‌టికే గ‌త నెల 29న వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు.. శ‌నివారం ప్రయోగం కూడా ఆగిపోయింది.

తాజాగా గ‌తంలో త‌లెత్తిన స‌మ‌స్యే త‌లెత్తింది. రాకెట్‌లోని ఇంజిన్ నెంబ‌ర్ 3లో ఇంధ‌న లీకేజీ క‌నిపించ‌గా... దానిని స‌రిదిద్దే య‌త్నాలు చేసినా ఫ‌లించ‌లేదు. దీంతో వ‌రుస‌గా రెండో పర్యాయం ఆర్టెమిస్‌- 1ను వాయిదా వేస్తున్న‌ట్లు నాసా శ‌నివారం ప్ర‌క‌టించింది. అయితే తిరిగి ఈ ప్ర‌యోగాన్ని ఎప్పుడు చేప‌ట్ట‌నున్నదీ మాత్రం నాసా వెల్ల‌డించ‌లేదు.

రాకెట్ ఇంజిన్‌లో ఇంధ‌న లీకేజీ కార‌ణంగా గ‌త నెల 29న ఆర్టెమిస్‌- 1 ప్ర‌యోగాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన నాసా.. తిరిగి ఈ నెల 3న ప్ర‌యోగించ‌నున్న‌ట్లు తెలిపిన సంగ‌తి తెలిసిందే.

ఇదీ చదవండి: మబ్బుల మధ్య చేపలు.. ఎన్నున్నాయో చూశారా..!

మరిన్ని వార్తలు