నాసా, స్పేస్‌ ఎక్స్ మరో అద్భుత విజయం

3 Aug, 2020 08:41 IST|Sakshi

ఫ్లోరిడా: అంతరిక్ష ప్రయోగాల్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెరికాకు చెందిన నాసా, స్పేస్‌ ఎక్స్ మరో అద్భుత విజయం సాధించాయి. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా అమెరికా వ్యోమగాములు డగ్‌ హార్లీ, బాబ్‌ బెంకెన్‌ అంతరిక్షం నుంచి క్షేమంగా భూమికి చేరుకున్నారు. భారత కాలమనం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 12.18కి ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో డ్రాగన్‌ క్యాప్సుల్‌ సురక్షితంగా దిగింది. వీరు సురక్షితంగా భూమికి చేరడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అపోలో కమాండ్‌ మాడ్యుల్‌ అమెరికాలో దిగిన 45ఏళ్ల తర్వాత ఇదే తొలి స్పాష్‌ డౌన్‌ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

ఈ ప్రయోగం విజయవంతం కావడంపై స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్‌ ఆనందం వ్యక్తం చేశారు. 'అంతరిక్షయానం కూడా సాధారణ విమాన ప్రయాణంలాగా మారిపోయినప్పుడు భవిష్యత్‌లో మానవాళి మనుగడకు భద్రత దొరికనట్లే' అంటూ ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. (ట్రంప్‌కి ఎన్ని కల్లలేనా?)

మరిన్ని వార్తలు