ఫ్లయింగ్‌ సాసర్స్‌ నిజమేనా?

23 Oct, 2022 02:10 IST|Sakshi

వాటి గుట్టు తేల్చేందుకు నాసా కమిటీ

వాషింగ్టన్‌: గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా? వారు ప్రయాణిస్తుంటారని చెప్పే ఫ్లయింగ్‌ సాసర్స్‌ (యూఎఫ్‌ఓ) నిజమేనా? ఇవి మనిషిని ఎంతోకాలంగా వేధిస్తున్న ప్రశ్నలు. మనకు సంబంధించినంత వరకూ యూఎఫ్‌ఓలు ఇప్పటిదాకా మిస్టరీగానే ఉంటూ వచ్చాయి. సాసర్‌ ఆకారంలో ఉండే ఇవి ఆకాశంలో దూసుకెళ్తుండగా చూశామని ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా చాలామంది చెబుతూ వచ్చారు. అంతకుమించి వీటికి సంబంధించి ఇప్పటిదాకా మనకు ఏమీ తెలియదు.

ఈ నేపథ్యంలో యూఎఫ్‌ఓల గుట్టేమిటో తేల్చేందుకు నాసా తాజాగా ఓ ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేసింది. దీనిపై లోతుగా పరిశోధన చేసేందుకు ఏకంగా 16 మందిని బృందంలో నియమించింది. అది సోమవారం నుంచి రంగంలోకి దిగనుంది. తొమ్మిది నెలలపాటు అన్నిరకాలుగా అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. ఈ మేరకు నాసా ట్వీట్‌ కూడా చేసింది.

మరిన్ని వార్తలు