NASA: సుడిగుండంలాంటి పాలపుంత ఫొటో.. మహాద్భుతం అంటున్న నెటిజన్స్‌

24 May, 2022 10:22 IST|Sakshi

వాషింగ‍్టన్‌: నాసాకు చెందిన హబ్బుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌.. గత ముప్పై ఏళ్ల కాలంలో కొన్ని మిలియన్ల ఫొటోలు తీసింది. కానీ, తాజాగా తీసిన ఓ ఫొటో మాత్రం మహాద్భుతమనే ప్రశంసను దక్కించుకుంటోంది. 

గుండ్రని వలయాలు, గులాబీ రంగులో నక్షత్రాలు, నీలి రంగు నక్షత్ర సమూహాలు.. వెరసి ఎం51 పాలపుంత ఫొటోల్ని పక్కాగా తీసి పంపింది హబ్బుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌. 

అంతరిక్షంలో గెలాక్సీ ఎం51(దీనికి వర్ల్‌పూల్‌ గెలాక్సీ) అనే పేరు కూడా ఉంది.  సర్వేల కోసం ఏర్పాటు చేసిన హబ్బుల్‌ అడ్వాన్స్‌డ్‌ కెమెరా ఈ ఫొటోల్ని క్లిక్‌మనిపించింది. 

గంభీరమైన స్పైరల్ గెలాక్సీ M51 వెడల్పాటి చేతులు.. నిజానికి నక్షత్రాల పొడవైన లేన్లు, ధూళితో నిండిన వాయువు.  గ్రాండ్-డిజైన్ స్పైరల్ గెలాక్సీలు" అని పిలవబడే ముఖ్య లక్షణం అని పేర్కొంది.

M51.. భూమి నుండి 31 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో కేన్స్ వెనాటిసి నక్షత్రరాశిలో ఉంది.

మరిన్ని వార్తలు