భూమిని ముద్దాడనున్న గ్రహశకలం! శుక్రవారం ఉదయం 5 గంటల  57 నిమిషాలకు!

27 Jan, 2023 12:44 IST|Sakshi

కేప్‌ కెనావెరల్‌ (వాషింగ్టన్‌): బుల్లి గ్రహశకలమొకటి భూమికేసి అత్యంత వేగంగా దూసుకొస్తోంది. ఆ క్రమంలో మనకు అత్యంత సమీపానికి రానుందట. ఎంత దగ్గరికంటే, దక్షిణ అమెరికా దక్షిణాగ్రానికి ఏకంగా 3,600 కిలోమీటర్ల సమీపానికి! అంటే అంతరిక్షంలో తిరుగుతున్న మన సమాచార ఉపగ్రహాల కంటే కూడా భూమికి పదింతలు సమీపానికి వచ్చి పడుతుందన్నమాట!! ఇది జరిగేదెప్పుడో తెలుసా? శుక్రవారం ఉదయం 5 గంటలకు 57 నిమిషాలకు! 

అయితే ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం దాదాపుగా లేనట్టేనని నాసా చెబుతోంది. ‘‘ఎందుకంటే భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల దాని మార్గం బాగా మారిపోతుంది. ఒకవేళ అది భూ వాతావరణంలోకి ప్రవేశించినా దాదాపుగా గాల్లోనే మండిపోతుంది’’ అంటోంది. మహా అయితే దాని ముక్కలు ప్రమాదరహితంగా భూమిపై పడితే పడొచ్చట. ఓ గ్రహశకలం భూమికి ఇంత సమీపానికి రావడం మనకు తెలిసి ఇదే తొలిసారని నాసా చెబుతోంది.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు