థర్డ్‌వేవ్‌ భయాలకు ఇదే సరైన పరిష్కారం!

23 May, 2021 15:42 IST|Sakshi

చదువు ముందుకు సాగాలంటే నాసల్‌ వ్యాక్సిన్‌ రావాల్సిందే!

డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌

జెనీవా: నాసల్‌ వ్యాక్సిన్‌ వస్తేనే ఇండియాలో విద్యా వ్యవస్థ గాడిన పడుతుందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌​ సౌమ్య స్వామినాథన్‌. సాధారణ వ్యాక్సిన్లతో పోల్చినప్పుడు ముక్కు ద్వారా టీకా అందించడం తేలికన్నారు. ఎక్కడైనా ఆ టీకాను సుళువుగా అందించవచ్చని, ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లలకు నాసల్‌ వ్యాక్సిన్లను స్కూళ్లలోనే అందించవచ్చని చెప్పారు. దీనివల్ల  దాదాపుగా స్కూల్‌ అంతా ఒకేసారి ఇమ్యూన్‌ అవుతుందని చెప్పారు. దీంతో పాఠశాలలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి భయం పోతుందన్నారు.

ఫలితంగా పిల్లలు స్వేచ్ఛగా స్కూల్‌కి వెళ్లి చదువుకోగలరని,  తల్లిదండ్రులు సైతం ధైర్యంగా పిల్లలను పాఠశాలకు పంపగలరంటూ ఆమె అభిప్రాయడ్డారు. అంతకంటే ముందు ఉపాధ్యాయులు, ఇతర స్కూల్‌ స్టాఫ్‌కి కూడా వ్యాక్సినేషన్‌ జరగాలన్నారు.  అప్పుడే  కరోనా థర్డ్‌వేవ్‌ భయాలు తొలగిపోతాయన్నారు. అయితే ప్రస్తుతం నాసల్‌ వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఆ వ్యాక్సిన్లకు అనుమతులు రావొచ్చని... అప్పటి వరకు థర్డ్‌వేవ్‌ భయాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందనే ప్రచారం సాగుతుండంతో​ సౌమ్య స్వామినాథన్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
(చదవండి: 20 ఏళ్ల తర్వాత అగ్నిపర్వతం బద్ధలు)

మరిన్ని వార్తలు