రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఎంతకాలం జరుగుతుందంటే..  

17 Sep, 2023 07:33 IST|Sakshi

ఫ్రాంక్‌ఫర్ట్, జర్మనీ: రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఇప్పటికి ఏడాదిన్నర పైబడింది. అయినా కూడా అక్కడ యుద్ధం సద్దుమణిగే పరిస్థితులైతే కనుచూపుమేరలో కనిపించడం లేదు. ప్రపంచ దేశాల్లో కూడా ఇదే అభిప్రాయం నెలకొందని ఉక్రెయిన్‌లో యుద్ధం ఇప్పటిలో ఆగదని సుదీర్ఘంగా కొనసాగుతుందని  ఓ ఇంటర్వ్యూలో తెలిపారు నాటో చీఫ్ జెన్స్ స్టోల్టన్‌బెర్గ్.  

 

ఏడాదిన్నర పైబడింది.. 
ఫిబ్రవరి 2022లో మాస్కో ఉక్రెయిన్‌కు బలగాలను పంపడంతో మొదలైన యుద్ధంలో ఉక్రెయిన్ మొదట్లో అంత దూకుడుగా వ్యవహారింకపోయినా జూన్ నుంచి మాత్రం దూకుడు పెంచి ప్రతిదాడులు కూడా మొదలు పెట్టిందని ఈ యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశముందని అన్నారు నాటో చీఫ్ స్టోల్టన్‌బెర్గ్. చాలా వరకు యుద్ధాలు మొదలైనప్పుడు ఊహించినదానికంటే ఎక్కువ కాలం కొనసాగుతూ  ఉంటాయని చెబుతూనే వీలైనంత తొందరగా అక్కడ శాంతి స్థాపించబడాలని కోరుకుంటున్నానన్నారు.

 

ఆపితే అంతే సంగతులు.. 
యుద్ధంలో వ్లాదిమిర్ జెలెన్‌స్కీ గానీ ఉక్రెయిన్ గానీ పోరాడకపోతే ఆ దేశం తుడిచి పెట్టుకుపోతుందనడంలో సందేహమే లేదు. ఎప్పుడైతే రష్యా ఆయుధాలను విడిచిపెడుతుందో అప్పుడే యుద్ధం సద్దుమణుగుతుందని అన్నారు. ఇక ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గురించి ప్రస్తావిస్తూ ఉక్రెయిన్ నాటోలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని క్యివ్ ఇప్పటికే నాటోకు చాలా దగ్గరైందని అన్నారు. యుద్ధం ముగిశాక ఉక్రెయిన్‌కు అన్నివిధాలా భద్రతా భరోసా కల్పించాలని అన్నారు. 

ఇది కూడా చదవండి: పాకిస్తాన్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.330

మరిన్ని వార్తలు