కూతురు అబార్ష‌న్‌కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది!

23 Jul, 2023 16:45 IST|Sakshi

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఇంటికే పరిమితం చేసినా లాక్ డౌన్ సమయంలో అమెరికాకు చెందిన ఒక యువతి చట్ట విరుద్ధమైన పనికి పాల్పడింది. సంతానం వద్దనుకున్న కారణంగా ఓ యువతి అబార్షన్ చేసి కడుపులోని బిడ్డని కడతేర్చింది. నెబ్రాస్కాలో 20 నెలల గర్భస్థ శిశువును చంపడం నేరం కాగా ఆమె 28 వారాలు నిండిన తర్వాత  ఈ ఘోరానికి పాల్పడింది. దీంతో ఈ నేరం కింద అరెస్టైన ఆ యువతికి కోర్టు మూడు నెలల జైలు శిక్షతో పాటు అదనంగా మరో రెండేళ్ల ప్రొబేషన్ కూడా విధించింది. . 

వివరాల్లోకి వెళితే.. నెబ్రాస్కాకు చెందిన సెలెస్టె బర్గస్(19) లాక్ డౌన్ సమయంలో కడుపులోని 28 నెలల పిండాన్ని చంపుకుంది. అందుకు ఆమె తల్లి జెస్సికా బర్గస్(42) సహకరించింది. కానీ నెబ్రాస్కా దేశ చట్టం ప్రకారం 20 నెలల పిండాన్ని అబార్షన్ చేస్తే అది చట్టరీత్యా నేరం. అయితే ఆ యువతి గర్భాన్ని తొలగించడానికి శతవిధాలా ప్రయత్నం చేసింది. చివరకు తన తల్లి సాయంతో అబార్ష‌న్‌కు పాల్పడి కటకటాల పాలయ్యింది.

తన కూతురు గర్భాన్ని తొలగించడానికి సాయం చేసిన ఆ తల్లిపైన కూడా కేసు నమోదు చేశారు నెబ్రాస్కా పోలీసులు. నిజాన్ని దాచి కోర్టును తప్పుదోవ పట్టించినందుకు కూతురిపైనా.. సాక్ష్యాధారాలు లేకుండా చేసినందుకు తల్లిపైనా అభియోగాలు మోపారు నెబ్రాస్కా పోలీసులు. ఇద్దరికీ శిక్ష ఖరారు కాగా సెప్టెంబరు నుండి అమల్లోకి వస్తుంది.      మొదట పోలీసు విచారణలో డెలివరీ అయ్యిందని, కానీ మృత శిశువు జన్మించిందని అబద్ధం చెప్పింది ఆ యువతి. తీరా ఆమె ఫేస్బుక్ మెసేజులు పరిశిలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫేస్ బుక్లో గర్బనిరోధక మాత్రలు గురించి, పిండాన్ని మాయ చేసే ఉపాయం గురించి తన తల్లితో చేసిన చాటింగ్‌ను పోలీసులు కనుగొనడంతో ఈ విషయం బయటపడింది.

ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి.. 

మరిన్ని వార్తలు