మెజారిటీ కోల్పోయిన ఓలి ప్రభుత్వం

6 May, 2021 04:40 IST|Sakshi

ఖాట్మాండూ: నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలికి షాక్‌ తగిలింది. ఆయన ప్రభుత్వానికి మద్దతిస్తున్న సీపీఎన్‌ (మావోయిస్ట్‌ సెంటర్‌) పార్టీ తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఓలి ప్రతినిధుల సభలో మెజారిటీ కోల్పోయారు. తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు సీపీఎన్‌ నేత పుష్ఫ కమల్‌ దహల్‌ ప్రచండ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్లమెంటు సెక్రటేరియట్‌కు సీపీఎన్‌ పార్టీ లేఖను పంపింది. ఓలి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని, ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు దేశ సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయని, అందుకే  మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో 275 మంది సభ్యులున్న సభలో ఓలికి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకొనేందుకు మరో 15 మంది సభ్యుల అవసరం ఉంటుంది. 

మరిన్ని వార్తలు