నేపాల్‌ ప్రధానికి సుప్రీం షాక్‌

24 Feb, 2021 03:47 IST|Sakshi

కఠ్మాండు: నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ ఓలి ప్రయత్నాలకు సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. మధ్యంతర ఎన్నికల ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పునిచ్చింది. ఆ నిర్ణయం చెల్లుబాటుకాదని తెలిపింది. పునరుద్ధరించిన పార్లమెంట్‌ దిగువ సభను 13 రోజుల్లోగా తిరిగి సమావేశపర్చాలంటూ ఆదేశించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చోళేంద్ర షంషేర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల  ధర్మాసనం ఈ మేరకు మంగళవారం సంచలన తీర్పు వెలువ రించింది. అధికార పార్టీకి, ప్రధాని కేపీ ఓలికి మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో దేశంలో రాజకీయ సంక్షోభం ప్రారంభమైంది. గతేడాది డిసెంబర్‌ 20వ తేదీన దిగువ సభ రద్దు, ఏప్రిల్‌లో ఎన్నికల నిర్వహణకు తేదీలను ప్రకటిస్తూ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఉత్తర్వులు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు