వాట్‌ ఏ ఎక్స్‌ప్రెషన్స్‌...ఎవ్వరికైనా నవ్వు రావల్సిందే....

1 Nov, 2021 18:26 IST|Sakshi

న్యూయార్క్‌: కొంత మంది తమ హావాభావాలతో భలే నవ్విస్తారు. అంతేకాదు కొంత మంది జోక్‌ చెప్పుతున్న తీరుని చూస్తేనే నవ్వుస్తుంది. నిజానికి వారు చెప్పే జోక్‌ కన్నా వారి ఫెషియల్‌ ఎక్స్‌ప్రెషన్‌న్ని బట్టే నవ్వు వచ్చేస్తోంది. అయితే ముఖకవళికలే ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి.

(చదవండి: సింహం సైలంట్‌గా ఉందని వేళాకోళం చేశావో..)

అంతేకాదు ఈ ముఖకవళికలే మనం అవతలి వ్యక్తితో చొరవగా ఉండేందుకు కూడా ఉపకరిస్తాయి. ఏంటిది అనుకోకండి. ఇక్కడ ఒక అనువాదకురాలు ఇద్దరు ప్రముఖ వ్యక్తుల సమావేశంలో ఆమె చూపించిన హావాభావాలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అసలెవరామె ఎక్కడ జరిగింది అనేకదా...

వివరాల్లోకెళ్లితే...వాటికన్‌ అనువాదకురాలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిగిన మావేశంలోను తాజగా అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన సమావేశాలను పోలుస్తూ ఒక వీడియు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే ఈ వీడియోలో రెండు సమావేశాల్లోనూ వాటికన్‌ అనువాదకురాలి ముఖకవళికలు నెటిజన్లుకు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి.

అంతేకాదు స్కాట్లాండ్‌లో జరిగనున్న కాప్26 శిఖరాగ్ర సమావేశం కోసం యూరోపియన్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ రోమ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ పర్యటనలో భాగంగా వాటికన్‌ పర్యటించినప్పుడు జో బైడెన్‌ వాటికన్‌ అనువాదకురాలు సమక్షంలో పోప్‌ని కలిసినప్పుడు ఆమె తెగ నవ్వుతూ ఉన్నారు. ఈ క్రమంలో గతంలో డోనాల్డ్‌ ట్రంప్‌  వాటికన్‌ పర్యటనలో ఇదే వాటికన్‌ అనువాదకురాలు సమక్షంలో పోప్‌ని కలిసినప్పుడు ఆమె సీరియస్‌గా ఉంటుంది.

దీంతో ఈ రెండూ సమావేశాల్లోను ఆమె హావాభావాలను పోలుస్తూ ఒక వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు వాటికన్‌ అనువాదకురాలి ఎక్స్‌ప్రెషన్స్‌ని చూసి తెగ నవ్వుతూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా  హయాంలో ఉన్న వైట్ హౌస్‌ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జెన్నిఫర్ పాల్మీరీ ఈ పోలికను "అద్భుతం" అని పోస్ట్‌ చేశారు.

(చదవండి: ఇదేం ట్రెండ్‌రా నాయనా... డస్ట్‌బిన్‌ కవరే డ్రెస్సు.!)

మరిన్ని వార్తలు