అమెరికాలో కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం

9 Jan, 2021 15:46 IST|Sakshi

అమెరికాలో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ఆందోళన

50 శాతం వేగంతో వ్యాప్తి:  వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్‌ 

వాషింగ్టన్‌ : 2021లో కూడా కరోనా మహమ్మారి పీడ వదిలేటట్టు లేదు. ఇప్పటికే  బ్రిటన్‌  స్ట్రెయిన్  కొత్త వేరియంట్‌ భయాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. జన్యుమార్పులతో  ఇది మరోసారి విజృంభిస్తోందన్న ఆందోళన కొనసాగుతుండగానే అమెరికాలో మరో వైరస్‌ ఉనికి మరింత ఆందోళన  రేపుతోంది.   బ్రిటన్‌  స్ట్రెయిన్  కరోనా కంటే  ఇది 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. 

అమెరికా రకం కరోనా వేరియంట్‌
బ్రిటన్‌లో స్ట్రెయిన్ మాదిరిగానే వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్ గుర్తించిన యూఎస్ రకం వ్యాప్తి తీరు కూడా ఉందని ఫుండ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ కమిషనర్ మీడియాకు వెల్లడించారు. ఇది స్ట్రెయిన్ యూఎస్ రకం అయి ఉండొచ్చు. యూకే స్ట్రెయిన్‌తో పాటుగా ఇది కూడా వ్యాపించిందని అంచనావేశారు. దీని వ్యాప్తి 50 శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్‌ హెచ్చరించింది. మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలను ప్రజలు సక్రమంగా పాటించకపోవడంతో ఈ వైరస్ వేరియంట్ వ్యాప్తి చెంది, తీవ్రం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, అమెరికాలో 52 యూకే రకం వైరస్‌ కేసులను గుర్తించారు. అయితే దీని వల్ల మరణాల తీవ్రత అధికంగా ఉంటుందనే ఆధారాలు మాత్రం లభించలేదని నిపుణులు అంటున్నారు.

కాగా కరోనా మహమ్మారి దెబ్బకు  అమెరికా విలవిల్లాడిపోయింది. జనవరి చివరి నాటికి మొత్తం మరణాలు 4 లక్షలు దాటాయి.  దాన్ని ప్రభావం ఇంకా చల్లాకరకముందే, కరోనా అంతానికి టీకాలు వచ్చాయనే ఆనందం కంటే.. కొత్త వైరస్‌ ఎక్కువ వణికిస్తోంది. తన రూపాన్ని మార్చుకున్న మహమ్మారి మరింత వేగంతో వ్యాపించడం ఆందోళనకు గురిచేస్తోంది.యూకే, దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తోంది. యూకే స్ట్రెయిన్ 70 శాతం వేగంగా వ్యాపిస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ యూకే కంటే ప్రమాదకారని, దీనికి ప్రస్తుత టీకాలు పనిచేయవని నిపుణులు భావిస్తున్నారు. ఇండియాలో  కూడా  యూ​కే   కరోనా రకం కేసులు  క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు