Deltacron: మరో కొత్త వేరియంట్‌ డెల్టాక్రాన్‌!

10 Jan, 2022 10:02 IST|Sakshi

కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌తో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతుంటే.. మరొకవైపు కొత్త వేరియంట్‌ వెలుగుచూసింది. సైప్రస్‌లో ఈ వేరియంట్‌ను గుర్తించారు. దీనికి ‘డెల్టాక్రాన్’ అని పేరు పెట్టారు.  ఇందులో డెల్టా వేరియంట్‌ లక్షణాలు, ఒమిక్రాన్‌ లక్షణాలు ఉండటంతో ప్రస్తుతానికి డెల్టాక్రాన్‌గా పేరుపెట్టారు. ఇంకా శాస్త్రీయంగా పేరుపెట్టాల్సి ఉంది. 

అయితే కొత్త రకం వేరియంట్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెపుతున్నారు. మరోవైపు డెల్టాక్రాన్ వేరియంట్ ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడే చెప్పాలమని మరికొందరు అంటున్నారు. సైప్రస్‌లో సేకరించిన నమూనాల్లో ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్లకు సంబంధించిన 10 మ్యూటేషన్లు గుర్తించినట్లు తెలుస్తోంది.

కరోనా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన బాధితుల నుంచి కొన్ని నమూనాలు, సాధారణ జనం నుంచి  కొన్ని నమూనాలు సేకరించిన తర్వాత దీనిని కనుగొన్నారు. కాగా, దీని మ్యూటేషన్ల స్థాయి ఎక్కువగా ఉందని ఈ వేరియంట్‌ను కనుగొన్న సైప్రస్‌ యూనివర్శిటీ వైరాలజీ నిపుణుడు లియోండస్‌ కోస్టిక్రిస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు