ఆ వైరస్‌ని చూసి భయపడుతూ.. తిట్టుకుంటూ కూర్చోవద్దు!!

28 Nov, 2021 21:21 IST|Sakshi

దక్షిణాఫ్రికాలో గుర్తించబడిన ఓమిక్రాన్ అనే ప్రాణాంతక కరోనావైరస్‌కి సంబంధించిన కొత్త వేరియంట్ గురించి అందరూ వినే ఉన్నాం. పైగా ఈ కొత్త రూపాంతరం శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగించే సమస్యగా మారింది. అంతేకాదు ప్రస్తుత వ్యాక్సిన్‌లు లక్ష్యంగా చేసుకునే వైరస్‌లో 30కి పైగా ఉత్పరివర్తనలు ఉన్నాయి.  ఈ మేరకు ఇది దక్షిణాఫ్రికాలో కొత్త ఇన్ఫెక్షన్ల పెరుగుదలపై ప్రపంచ దేశాలన్ని ఆందోళన వ్యక్తం చేశాయి.  

(చదవండి: సిగరెట్‌ కాల్చే అలవాటే ఆమె ప్రాణాల్ని కాపాడింది)

అంతేకాదు ఈ కొత్త రూపాంతరానికి సంబంధించిన కొన్ని కేసులు యూరప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే గుర్తించారు. దీంతో డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచదేశాలన్నింటిని అప్రమత్తం చేసింది. అసలే ఇప్పటికే రెండు సంవత్సరాల పాటు అందరూ ఇళ్లలోనే జైలు మాదిరిగా స్వచ్ఛంద నిర్బంధంలో ఉంటున్నారు. అంతేకాక దాదాపు ఎవరికి సంబంధం లేకుండానే గడుపుతున్నాం. పైగా ఈ కొత్త వేరియంట్‌తో ప్రజలంతా నిరుత్సాహనికి గురవుతున్నట్లు అందరీ ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ వేరియంట్‌ని ధైర్యంగా ఎదుర్కొంద్దాం అంటూ ప్రజలను ఉత్సహాపరిచేలా కొంతమంది నెటిజన్లు సామాజిక మాధ్యామాల్లో రకరకాల మీమ్‌లతో పోస్టులు పెడుతున్నారు. పైగా అవి మానసికంగా మనల్ని ధృడంగా చేయడమే కాక నూతన ఉత్సహాన్ని ఇచ్చేలా ఉన్నాయి. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

(చదవండి: బిడ్డ పుట్టాలని సైకిల్‌ తొక్కింది!... అంతే చివరికి!!)

మరిన్ని వార్తలు