ఒలింపిక్స్ వింటర్ గేమ్స్ కోసం చైనా ప్రత్యేక బుల్లెట్ ట్రైన్.. స్పీడ్ అదిరిపోలే?

7 Jan, 2022 20:39 IST|Sakshi

బీజింగ్: ఫిబ్రవరిలో జరగబోయే బీజింగ్ ఒలింపిక్స్ వింటర్ గేమ్స్ కోసం చైనా ప్రత్యేక బుల్లెట్ రైలును ప్రారంభించింది. ఈ బుల్లెట్ రైలు ముఖ్య ప్రత్యేకత ఇందులో డ్రైవర్ లేకపోవడమే. కేవలం ఈ ఒలింపిక్స్  కోసం కొత్త బుల్లెట్ రైలును ఆవిష్కరించింది. డ్రైవర్ లెస్ ఫ్యూక్సింగ్ బుల్లెట్ రైలు గంటకు 217 మైళ్ల(350 కిమీ) వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి ఉన్న ఎనిమిది క్యారేజీలలో 564 మంది ప్రయాణీకుల వెళ్లగలరు.

చైనా రాజధాని బీజింగ్ - జాంగ్జియాకౌ నగరాల మధ్య ప్రయాణీకులను తీసుకెళ్లడానికి దీనిని ప్రారంభించింది. ఇందులో 5జీ సౌకర్యం గల లింక్డ్ బ్రాడ్ కాస్ట్ స్టూడియో ఉంది. దీని ద్వారా పాత్రికేయులు ప్రసారం చేయవచ్చు. బీజింగ్ డౌన్ టౌన్ జిల్లా నుంచి జాంగ్జియాకౌలోని ఒలింపిక్స్ గేమ్స్ జరిగే వేదికలకు ప్రయాణీకులను తరలించడానికి కేవలం 50 నిమిషాలు పడుతుందని ఆ దేశ క్సిన్హువా పత్రిక నివేదించింది. 2018లో ఈ రైల్వే నిర్మాణం ప్రారంభమైంది. కేవలం ఏడాది కాలంలోనే 2019లో ఈ మార్గాన్ని(బీజింగ్-జాంగ్జియాకౌ) పూర్తిచేసింది.

(చదవండి: అదిరిపోయిన తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. రేంజ్, ధర ఎంతో తెలుసా?)

మరిన్ని వార్తలు