షాకింగ్‌ ఘటన: జడ్జి, ఆమె భర్త, పెంపుడు జంతువులతో సహా మృతి

28 Nov, 2022 16:01 IST|Sakshi

ఏమైందో ఏమో ఒక మహిళా జడ్జి, ఆమె భర్త, వారి పెంపుడు జంతువులతో సహా ఇంట్లోనే విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటన న్యూమెక్సికోలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న బెర్నాలిల్లో కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం అధికారులు(పోలీసులు) అల్బుకెర్కీలోని రాంచిటోస్‌ రోడ్‌లో ఉన్న ఆ జడ్జీ ఇంటి వద్దకు వచ్చి తనిఖీలు నిర్వహించారు.

ఆ ఇంట్లో పనిచేసే వాళ్లు తాము పనికి వచ్చేటప్పటికే ఆ భార్యభర్తలిద్దరు, వారి పెంపుడు జంతువులు చనిపోయి ఉన్నట్లు తెలిపారు. మృతి చెందిన మహిళ లాస్‌ రాంచోస్‌ మున్సిపల్‌ న్యాయమూర్తిగా పనిచేస్తున్న 65 ఏళ్ల డయాన్‌ ఆల్బర్ట్‌గా గుర్తించారు. ఐతే పోలీసులు జడ్జీ భర్త ఎరిక్‌ పింక్‌టరన్‌ తన భార్య ఆల్బర్ట్‌తోపాటు వారి పెంపుడు జంతువులను తుపాకీతో కాల్చి చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆ తర్వాత పింక్‌టరన్‌ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే బాధితుడు పింక్‌టరన్‌ తన స్నేహితుడుకి తన భార్యను పెంపుడు జంతువులను తుపాకీతో కాల్చి చంపినట్లు వాయిస్‌ మెసేజ్‌ పంపాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు మెయిల్‌లో వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యి అతను కౌంటీ షరీఫ్‌ కార్యాలయానికి సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం అధికారులు కేసు నమోదు చేసుకుని పలుకోణాల్లో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. 

(చదవండి: ఢిల్లీలో శ్రద్ధ తరహా ఘటన.. కుమారుడితో కలిసి భర్తను చంపిన భార్య.. శవాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో..)

మరిన్ని వార్తలు