వామ్మో.. పొరుగు దేశంలో కొత్త రకం కరోనా

25 Apr, 2021 15:28 IST|Sakshi

కొలంబో: గాలి ద్వారా వ్యాపించే కొత్త రకం కరోనా వైరస్‌ను తమ దేశంలో గుర్తించినట్లు శ్రీలంక వైద్య నిపుణులు తెలిపారు. మునుపటి కరోనాతో పోలిస్తే ప్రస్తుతం దీని ప్రభావం, వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఇది గాల్లో దాదాపు గంట సేపు పైనే మనుగడ సాగించగలదని శ్రీ జయవర్ధనపుర విశ్వవిద్యాలయంలో ఇమ్యునాలజీ విభాగం అధిపతి నీలికా మలవిగే చెప్పారు. ఇటీవల దేశంలో కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఎక్కువ యువత కరోనా బారిన పడుతున్నారని అన్నారు.

అయితే రాబోయే 2-3 వారాలలో తరువాతే నిజమైన పరిస్థితి బయటపడుతుందని ఆయన అన్నారు. శ్రీలంకలో కోవిడ్‌ నివారణ కోసం అక్కడి ‍ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇది మే 31 వరకు అమలులో ఉండనుంది. శ్రీలంక కూడా అనేక దేశాల మాదిరిగానే , కరోనా కేసుల సంఖ్యను నివారించలేకపోతోంది. ప్రస్తుత శ్రీలంకలో కేసుల సంఖ్య 99,691 ఉండగా, 638 మరణాలు నమోదయ్యాయి. కేసుల పెరుగుతున్ననేపథ్యంలో రోగులకు చికిత్స చేయడానికి ఆస్పత్రుల్లో తగినంత వైద్యం సామర్థ్యాన్ని కలిగి ఉన్నామని, అయితే వ్యాప్తిని నివారించడానికి ఆరోగ్య మార్గదర్శకాలను పాటించడం చాలా ముఖ్యం అని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అసేలా గుణవర్ధన అన్నారు.

( చదవండి: Double Masking: రెండు మాస్కులు ధరిస్తే కరోనా రాదా?

మరిన్ని వార్తలు