మరో కొత్త గ్రహన్ని గుర్తించిన నాసా..అచ్చం భూమిలాగే..!

11 Jun, 2021 19:56 IST|Sakshi

వాషింగ్టన్‌: విశ్వంలో భూమితో పాటు వేరే ఇతర గ్రహలు నివాసయోగ్యానికి కచ్చితంగా ఉండి ఉంటాయనేది పరిశోధకుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగా నాసా ఇప్పటికే భూమిని పోలి నివాసయోగ్యంగా ఉండే ఇతర గ్రహలపై అన్వేషణ కొనసాగిస్తోంది. కాగా ప్రస్తుతం అచ్చం భూమిలాగా ఉన్న మరో గ్రహన్ని అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. కాగా ఈ గ్రహం భూమి నుంచి సుమారు 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

భూ వాతావరణంలో ఉన్నట్లుగా ఈ గ్రహంపై కూడా మేఘాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహానికి పరిశోధకులు టివోఐ-1231బి(TOI-1231b)గా నామకరణం చేశారు.  భూ గ్రహంతో పోలిస్తే చాలా పెద్దగా, నెఫ్ల్యూన్‌తో పోలిస్తే కాస్త చిన్నగా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.  నాసా తెలిపిన వివరాల ప్రకారం టివోఐ-1231బి గ్రహంపై సుమారు మన భూమిపై ఉన్న వాతావరణ పరిస్థితులు కల్గి ఉన్నట్లుగా పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా టివోఐ-1231బి గ్రహం భూ వాతావరణంపై ఉన్న ఉష్ణోగ్రత సుమారు 57 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉన్నట్లుగా గుర్తించారు. నాసా ఇప్పటివరకు కనుగొన్న గ్రహల్లో టివోఐ-1231బి చిన్న గ్రహంగా నిలిచింది. కాగా ఈ గ్రహంపై మరింత పరిశోధనలు చేయాల్సి ఉందని తెలిపారు. 

చదవండి: ఖగోళంలో భారీ విస్పోటనం.. పలు పరిశోధనలకు ఆటంకం!

మరిన్ని వార్తలు