గుండె వేగంతో ‘డిప్రెషన్’ గుర్తింపు..

12 Sep, 2020 17:37 IST|Sakshi

బెల్జియమ్‌: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మెజారిటీ ప్రజలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రెటీల నుంచి సామాన్య జనాలను వేధిసున్న సమస్య డిప్రెషన్‌(మానసిక రుగ్మత). అయితే డిప్రెషన్‌ను ప్రారంభ దశలోనే ఎదుర్కోవాలి, లేకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు వైద్యులు అనేక దశాబ్ధాలుగా కృషి చేస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు ఓ కొత్త అధ్యయనాన్ని వెల్లడించారు. కాగా డిప్రెషన్‌తో బాధపడే వ్యక్తులను గుర్తించాలంటే గుండె వేగాన్ని(24 గంటల పాటు) పరీక్షించాలని అధ్యయనం ద్వారా తేల్చారు.

అయితే గుండె వేగం ద్వారా డిప్రెషన్‌కు సంబంధించిన చికిత్స పనిచేస్తుందో లేదో తెలుసుకోవచ్చని తెలిపారు. బెల్జియమ్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ స్కీవెక్‌ నేతృత్వంలో అధ్యయనం చేశారు. కాగా ఇది వరకు కొందరు అధ్యయనకర్తలు గుండె వేగం ఎక్కువున్న వారు డిప్రెషన్‌తో బాధపడుతున్నట్ల తెలిపారు. కానీ కొంత అసంపూర్ణంగా ఉండేది. కానీ ప్రస్తుతం తాము పటిష్టమైన అధ్యయనం చేశామని 16మంది ఆరోగ్యవంతులు, 16మంది డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిని అధ్యయనానికి వాలంటీర్లుగా తీసుకున్నట్లు తెలిపారు. కాగా ప్రామాణిక అధ్యయనం చేసినట్లు డాక్టర్ స్కీవెక్‌ పేర్కొన్నారు. (చదవండి: ‘నువ్వు చచ్చిపోతే ఒక రోజు వార్తలో ఉంటావు’)

మరిన్ని వార్తలు