నో-టచ్ థర్మామీటర్లతో జర జాగ్రత్త!

17 Dec, 2020 20:44 IST|Sakshi

కరోనా మహమ్మారి కారణంగా ఏక్కువ శాతం మంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కనబరుస్తున్నారు. బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం, ఇంటికి వచ్చినప్పుడు చేతుల కడుక్కోవడం రోజువారీ అలవాట్లలో భాగమయ్యాయి. ప్రస్తుతం పిల్లలు, వృద్దులు ఉన్న ఇళ్లలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్పాలి. అందుకే ఈ ఇళ్లలోశరీర ఉష్ణోగ్రతలు కొలిచే థర్మామీటర్లను కూడా ఉపయోగిస్తున్నారు. కోవిడ్ -19 లక్షణాలలో జ్వరం ప్రధానమైంది. అందుకోసమే ప్రతి ఇళ్లలో సాధారణ థర్మామీటర్లతో పాటు, ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న నో-టచ్ థర్మామీటర్లు కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు నో-టచ్ థర్మామీటర్లు పబ్లిక్ టెంపరేచర్ స్క్రీనింగ్ కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కానీ, నో-టచ్ థర్మామీటర్ల యొక్క కచ్చితత్వం విషయంలో అనుమానులు రేకెత్తుతున్నాయి. (చదవండి: ఈ మాస్క్‌ వెరీ స్పెషల్‌..ధర 69వేలకు పైనే..)

సాధారణ థర్మామీటర్లతో పోలిస్తే నో-టచ్ థర్మామీటర్లు ఉష్ణోగ్రతల నమోదు విషయంలో తేడాలు ఉన్నట్లు అమెరికన్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్‌లో ప్రచురించబడింది. కొందరు ఆస్ట్రేలియా పరిశోధకులు 265 అంటువ్యాధి లేని రోగులపై అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో భాగంగా శరీర ఉష్ణోగ్రత రికార్డింగ్‌లను సేకరించడానికి నో-టచ్ థర్మామీటర్లు, తాత్కాలిక ధమని థర్మామీటర్లను ఉపయోగించినప్పుడు తేడాలు గమనించారు.

శరీర ఉష్ణోగ్రతలు 100.4 డిగ్రీల ఫారెన్‌హీట్(38 డిగ్రీల సెల్సియస్) కంటే తక్కువ ఉన్నపుడు ఒకే విధమైన ఫలితాలు చూపించినట్లు పేర్కొన్నారు. కానీ, శరీర ఉష్ణోగ్రతలు 100.4 డిగ్రీల ఫారెన్‌హీట్(38 డిగ్రీల సెల్సియస్) కంటే ఎక్కువ నమోదైనప్పుడు టెంపోరల్ ఆర్టరీ థర్మామీటర్స్ (టాట్) చేత పరీక్షించిన 6 శరీర ఉష్ణోగ్రతలలో 5 శరీర ఉష్ణోగ్రతలను నో-టచ్ థర్మామీటర్లు తప్పుగా చూపిస్తున్నాయని కనుగొన్నారు. అందుకే నో-టచ్ థర్మామీటర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు