న్యూయార్క్‌లో స్కూళ్లకు దీపావళి సెలవు.. ప్రియాంకా చోప్రా హర్షం

24 Oct, 2022 05:36 IST|Sakshi

లాస్‌ఏంజెలెస్‌: న్యూయార్క్‌లోని పాఠశాలలకు దీపావళి పండుగ రోజును సెలవుగా ప్రకటించడంపై బాలీవుడ్‌ నటి, నిర్మాత ప్రియాంకా చోప్రా జొనాస్‌ హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని పబ్లిక్‌ స్కూళ్లకు 2023 నుంచి దీపావళి రోజున సెలవు ఉంటుందని న్యూయార్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ గురువారం ప్రకటించడంపై శనివారం రాత్రి ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు.

తన చిన్నతనంలో న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో స్కూలుకు వెళ్లినప్పటి రోజులను గుర్తుకు వచ్చి ఏడ్చేశానని పేర్కొన్నారు. న్యూయార్క్‌ నగరంలో భారత సంతతికి చెందిన సుమారు 2 లక్షల మంది హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతస్తులున్నారు. వీరంతా దీపావళి పండుగను జరుపుకుంటారని, అందుకే సెలవుగా ప్రకటించాలని నిర్ణయించామని మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ తెలిపారు. ప్రియాంకా చోప్రా ప్రస్తుతం లాస్‌ఎంజెలెస్‌లో నివాసం ఉంటున్నారు.

మరిన్ని వార్తలు