చిత్రమైన కేసు... ఏనుగుని వ్యక్తిగా పరిగణించాలంటూ పిటిషన్‌

20 May, 2022 17:00 IST|Sakshi

The elephant is being imprisoned against her will: న్యూయార్క్‌ అత్యున్నత న్యాయస్థానం ఓ చిత్రమైన కేసుని విచారిస్తోంది. 51 ఏళ్ల హ్యపీ అనే ఆసియా ఏనుగుని బ్రోంక్స్‌ జూలో చట్టవిరుద్ధంగా నిర్బంధించారంటూ జంతుహక్కుల సంస్థ నాన్‌హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేసింది. నిజానికి హెబియస్ కార్పస్ అనేది ఒక వ్యక్తిని నిర్బంధించడం చట్టబద్ధమైనదో కాదో నిర్ధారించేందుకు ఉపయోగిస్తారు. అయితే ఏనుగు తరుపు న్యాయవాది  స్టీవెన్ వైస్.. ఏనుగు ఇష్టానికి వ్యతిరేకంగా జూలో ఖైదీగా నిర్బంధించబడిందని, ఏనుగు జ్ఞానపరంగా తెలివైన జంతువు కాబట్టి మనుషులకు ఉండే అన్ని రకాలు హక్కులు దీనికి ఉండాలని చెబుతున్నారు.

అంతేగాదు ఈ ఏనుగు 1977 నుంచి జూ లోనే నిర్బంధించి ఉంటుందని అందువల్ల దీనిని ఇప్పుడైనా ఏనుగుల అభయారణ్యంలోకి తరలించాలని అభ్యర్థించారు.  కానీ బ్రోంక్స్‌ జూ మాత్రం ఏనుగుని బాగా చూసుకుంటున్నామని, ఏనుగు నిర్బంధం చట్టవిరుద్ధం కాదని వాదిస్తోంది. 2018 నుంచి దాఖలైన ఈ విచిత్రమైన కేసులో జంతు హక్కుల సంస్థ అనేక దిగువ కోర్టుల్లో ఓడిపోతూ వస్తోంది. అయితే ధర్మాసనం ఈ విచిత్రమైన కేసులో ఏనుగుని వ్యక్తిగా పరిగణిస్తుందా లేదా అనే దాని పైనే తీర్పు ఆధారపడి ఉందని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పర్కొంది. అంతేగాదు ఈ న్యూయార్క్‌ అప్పీల్‌ కోర్టు తీర్పు ఇచ్చేవరకు కూడా హ్యాపీ జూలోనే ఉండాల్సిందేనని తెలిపింది. 

మరిన్ని వార్తలు