న్యూయార్క్‌ వాసులకు చుక్కలు చూపిస్తున్న ఎలుకలు.. ఖతం చేసేందుకు ఏకంగా కోటికి పైగా జీతం!

4 Dec, 2022 06:17 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికాలో న్యూయార్క్‌ని నిద్రపోని నగరం అని అంటారు. ఎలుకలు నిజంగానే న్యూయార్క్‌వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సబ్‌ వేలు, మెట్రో స్టేషన్లు, రోడ్డు పక్కనున్న చెత్త కుండీలు... ఎక్కడ చూసినా స్వైరవిహారం చేస్తున్నాయి. న్యూయార్క్‌ జనాభా 88 లక్షలైతే ఎలుకలు ఏకంగా 20 లక్షల వరకు ఉన్నాయట!

ఎలుకలను నిర్మూలించే వారికి ‘‘డైరెక్టర్‌ ఆఫ్‌ రోడెంట్‌ మిటిగేషన్‌’’ పేరుతో పెద్ద ఉద్యోగాన్ని మేయర్‌ కార్యాలయం ఆఫర్‌ చేసింది! ఇందుకు భారీగా  1,20,000 నుంచి 1,70,000 డాలర్లు (రూ.96 లక్షల నుంచి రూ.1.36 కోట్లు) వేతనం చెల్లిస్తారు!! అక్టోబర్‌ నుంచే న్యూయార్క్‌ ప్రభుత్వం  ఎలుకలపై యుద్ధం మొదలు పెట్టింది. ఇందుకోసం రేయింబవళ్లు వ్యూహాలు పన్నుతూ వాటిని తుదముట్టించే వారికోసం ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తోంది!

మరిన్ని వార్తలు