చిన్నారికి అత్యవసర శస్త్ర చికిత్స...ఆ రక్తం వద్దంటూ కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

30 Nov, 2022 16:57 IST|Sakshi

నాలుగు నెలల శిశువుకి గుండెకి సంబంధించిన శస్త్ర చికిత్స వెంటనే చేయాలి. ఐతే అందుకు దాతల నుంచి రక్తం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ససేమిరా అంటు తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్‌లోని నాలుగు నెలల చిన్నారికి గుండెకి సంబంధించి లైఫ్‌ సేవింగ్‌ సర్జరీ వెంటనే చేయాల్సి ఉంది. ఐతే సర్జరీ కోసం దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకు ఆ శిశువు తల్లిదండ్రులు ఆ రక్తం ఉపయోగిస్తే ఏమవుతుందో అని ఆందోళనతో హైకోర్టుని ఆశ్రయించారు. వారికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారి నుంచి సేకరించి రక్తం తమ బిడ్డకు ఎక్కించడంపై విముఖత చూపుతున్నారు. ఈ మేరకు ఆ చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ...తమ బిడ్డకు తీవ్రమైన పల్మనరీ వాల్వ్‌ స్టెనోసిస్‌ ఉందని, శస్త్ర చికిత్స వెంటనే చేయాల్సి ఉందని చెప్పారు.

ఐతే అందుకు ఉపయోగించే రక్తం పట్ల ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌లు తీసుకున్న కలుషిత రక్తం కాకుండా మరేదైనా ఐతే తమకు అభ్యంతరం లేదంటున్నారు. ఐతే న్యూజిల్యాండ్‌ బ్లడ్‌ సర్వీస్‌.. దాతాలు వ్యాక్సిన్‌ తీసుకునే దానినిబట్టి వారి నుంచి సేకరించిన రక్తాన్ని వేరుచేయడం జరగదని స్పష్టం చేసింది. అలాగే వ్యాక్సిన్‌ తీసుకున్న వారి రక్తాన్ని ఉపయోగించడం ద్వారా ఏదైనా ప్రమాదం ఉందనే దానిపై ఎటువంటి ఆధారాలు కూడా లేవని పేర్కొంది. ఈ క్రమంలో ఆక్లాండ్‌ టె వాటు ఓరా ఆస్పత్రి డైరెక్టర్‌ వైద్యుడు మైక్ షెపర్డ్ మాట్లాడుతూ..".అనారోగ్యంతో ఉన్న పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులకు వారి సంరక్షణ కోసం తీసుకునే నిర్ణయం విషయంలో ఎంత ఆందోళన చెందుతారో అర్థం చేసుకున్నాం.

శిశువు ఆరోగ్యం దృష్ట్యా పిల్లల సంరక్షణ చట్టం కింద సదరు చిన్నారిని తల్లిదండ్రుల సంరక్షణ నుంచి తప్పించి కోర్టు కస్టడీకి తీసుకోవాలి. అలాగే దానం చేసిన రక్తాన్ని ఉపయోగించేలా శస్త్ర చికిత్సకు అనుమతి ఇవ్వాలంటూ పిటీషన్‌ దాఖలు చేశాం. చిన్నారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పిటీషన్‌ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు." ఈ మేరకు హైకోర్టులో విచారణకు ఇరు పార్టీలు బుధవారం కోర్టులో హాజరయ్యారు. ఐతే కోర్టు వద్ద సుమారు వంద మందికి పైగా కరోనా వ్యాక్సిన్‌ వ్యతిరేక మద్దతుదారుల బృందం పెద్ద ఎత్తున​ గుమిగూడి ఉండటం గమనార్హం. న్యూజిల్యాండ్‌ ధర్మాసం ఏం చెబుతుందా అని అందరూ ఒకటే ఆతృతతో ఎదురుచూస్తున్నారు. 

(చదవండి: జలరాకాసి నోట చిక్కి.. తల్లిదండ్రుల కళ్ల ముందే తల తెగిపడింది! అంతలోనే..)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు