బిడ్డ పుట్టాలని సైకిల్‌ తొక్కింది!... అంతే చివరికి!!

28 Nov, 2021 18:31 IST|Sakshi

న్యూజిలాండ్‌లోని గ్రీన్‌కు చెందిన పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) తన బిడ్డ పుట్టడం కోసం సైకిల్‌పై ఆసుపత్రికి వెళ్లి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ మేరకు ఎంపీ జూలీ అన్నే జెంటర్ గతంలో తన మొదటి బిడ్డ, కొడుకు పుట్టిన సమయంలో కూడా ఇలాగే చేయడం గమనార్హం. ఈ మేరకు ఆమె కడుపుతో ఉండి సైక్లింగ్‌ చేసిన విధానాని వివరిస్తూ ఫోటోలను కూడా  సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. దీంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: కరోనా ఆంక్షలు ఎత్తివేయడం అసాధ్యం!..హెచ్చరిస్తున్న అధ్యయనాలు)

ఈ మేరకు జెంటర్‌కి సైకిల్ తొక్కాలని ముందుగా ఎటువంటి ప్లాన్‌ చేయలేదు. అయితే జెంటర్‌కి తెల్లవారుఝామున 2 గంటలకు నొప్పులు రావడంతో ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకుంది. పైగా ఆ నొప్పులు అంత ఎక్కువగా ఏమి రావడం లేదుకదా అని సైక్లింగ్‌ చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లాలనుకుంది. ఆ తర్వాత ఆమెకు ఉదయ 3 గంటల సమయంలో సుఖ ప్రసవం అయ్యి ఆరోగ్యవంతమైన మగపిల్లాడు పుట్టాడు. అంతేకాదు జెంటర్‌ తాను సైక్లింగ్‌ చేయడం వల్ల ఎక్కువ సేపు నొప్పుల పడాల్సిన అవసరం లేకుండానే చాలా తొందరగా ప్రసవం అయిపోయిందంటూ క్యాప్షన్‌ పెట్లి మరి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెను ప్రశంసించడమేకాక సైక్లింగ్ వంటి వ్యాయామాల వల్ల డెలివరీ సమయంలో మంచి ప్రయోజనం ఉంటుందంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు. 

(చదవండి: ఆ దేశంలో అట్టహాసంగా కోతుల పండగ!)

మరిన్ని వార్తలు