యువత సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం: న్యూజిలాండ్‌లో కొత్త చట్టం

14 Dec, 2022 07:33 IST|Sakshi

వెల్లింగ్టన్‌: ఆరోగ్యాన్ని హరించే పొగాకు వినియోగాన్ని అరికట్టడానికి న్యూజిలాండ్‌ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం కొత్తగా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం యువత ఇకపై సిగరెట్లు కొనడానికి వీల్లేదు. వారు సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం విధించారు. 2009 జనవరి 1న, ఆ తర్వాత జన్మించినవారంతా సిగరెట్లకు దూరంగా ఉండాలి. వారికి ఎవరైనా సిగరెట్లు విక్రయిస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి.

కొత్త చట్టం వల్ల సిగరెట్లు కొనేవారి సంఖ్య ప్రతిఏటా తగ్గిపోతుందని, తద్వారా దేశం పొగాకు రహితంగా మారుతుందని న్యూజిలాండ్‌ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలో సిగరెట్లు విక్రయించేందుకు అనుమతి ఉన్న రిటైలర్ల సంఖ్యను కొత్త చట్టం కింద 6,000 నుంచి 600కు కుదించింది. సిగరెట్లలో నికోటిన్‌ పరిమాణాన్ని తగ్గించింది. ఉపయోగించినవారిని భౌతికంగా అంతం చేసే సిగరెట్లను విక్రయించడానికి అనుమతించడంలో అర్థం లేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ ఆయేషా వెరాల్‌ చెప్పారు.

ఇదీ చదవండి: అనంత శక్తిని ఒడిసిపట్టే... దారి దొరికింది!

మరిన్ని వార్తలు