అమెరికానే బురిడీ కొట్టించిన నిత్యానంద.. అసలు కైలాస దేశమే లేదు..

18 Mar, 2023 12:48 IST|Sakshi

వాషింగ్టన్‌: వివాదాస్పద గురువు నిత్యానంద ఏకంగా అమెరికానే బురిడీ కొట్టించాడు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కొద్దికాలం క్రితం భారత్ నుంచి పారిపోయిన ఈయన.. ఓ ఐలాండ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దానికే 'యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్ కైలాస' అని పేరుపెట్టుకున్నాడు. ఇదే తన దేశమని ప్రకటించుకున్నాడు. ఇటీవల  ఐక్యరాజ్య సమితిలో కైలాస  ప్రతినిధులు పాల్గొని భారత్‌కు వ్యతిరేకంగా ప్రసంగించారు. వీరి ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

అయితే 'సిస్టర్ సిటీ' పేరుతో కైలాస దేశం అమెరికాలోని నెవార్క్‌ నగరంతో ఒప్పందం కుదుర్చుంది. జనవరి 12న ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రతులపై ఇరువురు సంతకాలు కూడా చేశారు. దీంతో పాటు వర్జీనియా, ఓహియో, ఫ్లోరిడా  సహా అమెరికాలోని 30 నగరాలు కైలసతో సాంస్కృతిక ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ఆ దేశం తెలిపింది.

కానీ అసలు కైలాస అనే దేశమే లేదని తెలుసుకున్నాక అమెరికా నగరాలు నివ్వెరపోయాయి. దీంతో నెవార్క్ నగరం కైలాసతో ఒప్పందాలు రద్దు చేసుకుంది. కనీసం ఒక దేశం ఉందో లేదో కూడా తెలుసుకోకుండా ఇలా గుడ్డిగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ఏంటని నెవార్క్‌ అధికారులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: పుతిన్‌పై ఐసీసీ అరెస్టు వారెంట్‌

మరిన్ని వార్తలు