నవజాత శిశువు కడుపులో కవల పిండం...షాక్‌లో తల్లి

10 Dec, 2022 11:37 IST|Sakshi

కవల పిండంతో ఒక నవజాత శిశువు జన్మించింది. ఈ ఘటన ఇజ్రాయెల్‌లో అష్టోడ్‌లోని అసుతా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. తల్లి గర్భంలో ఉండగానే నిర్వహించిన అల్ట్రాసౌండ్‌  పరీక్షల్తో శిశువు ఏదో సమస్యతో ఉన్నట్లు గుర్తించారు. కానీ ఆ శిశువు జన్మించాక నిర్వహించిన పరీక్షల్లో కడుపులో ట్విన్‌పిండం ఉన్నట్లు గుర్తించి వైద్యులు ఒక్కసారిగా షాక్‌ గురయ్యారు.

వివరాల్లోకెళ్తే...నవజాత శిశువు కడుపులో కవల పిండం ఉంది. దీన్ని ఫీటస్‌ ఇన్‌ ఫీటూ(ఎఫ్‌ఐఎఫ్‌) అంటారు. గతేడాది బిడ్డ పుట్టిన తర్వాత వైద్యులు అల్ట్రాసౌండ్‌ ఎక్స్‌రేలతో సహా పలు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో శిశువు పొత్తికడుపులో పాక్షికంగా అభివృద్ధి చెందిన పిండాన్ని కనుగొన్నారు. వైద్యులు శిశువు కడుపులో కవల పిండం ఉన్నట్లు చెప్పగానే ఆ చిన్నారి తల్లి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. ఆ తర్వాత ఆ శిశువుకు విజయవంతంగా ఆపరేషన్‌ చేసి ఆ పిండాన్ని తొలగించారు.

ఈ మేరకు మెడికల్‌ సెంటర్‌లోని నియోనాటాలజీ డైరెక్టర్‌ డాక్టర్ ఒమెర్ గ్లోబస్ మాట్లాడుతూ... ఆ శిశువు పొత్తి కడుపులో ఉన్నది పిండం అని తెలుసుకుని మేము ఆశ్యర్యపోయాం. కానీ పరీక్షల్లో అది పిండంలా కనిపించలేదు. ఐతే అది పొత్తి కడుపులో పాక్షికంగా అభివృద్ధి చెందుతుంది కానీ జీవించదని అక్కడే అలా ఉండిపోతుందని చెబుతున్నారు. సదరు తల్లి ఆలస్యంగా గర్భం దాల్చిందని కూడా చెప్పారు అందువల్ల కూడా పలు సమస్యలు తలెత్తుతాయని అన్నారు. కానీ ఇలాంటి అరుదైన పరిస్థితి ప్రతి అరమిలియన్‌ జననాలకు ఒకరికి మాత్రమే సంభవిస్తుంది.

(చదవండి: వామ్మో! దగ్గితే పక్కటెముకలు విరిగిపోవడమా!)

మరిన్ని వార్తలు