లైవ్‌లో యాంకర్‌.. వెనకాల డ్యాన్సర్‌

5 Aug, 2020 18:15 IST|Sakshi

లండన్‌: టీవీలో కనపడాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఏదైనా సంఘటన జరిగి.. మీడియా వాళ్లు వస్తే చాలు.. జనాలు ఎగబడిపోతుంటారు. యాంకర్ల తమ పని తాము చేసుకుని పోతుంటే.. టీవీలో కనపడాలనే ఔత్సాహికులు తమ పని తాము చేసుకు పోతుంటారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ యాంకర్‌ బీచ్‌ నుంచి రిపోర్టింగ్‌ చేస్తుండగా.. ఆమె వెనకే ఓ పిల్లాడు డ్యాన్స్‌ చేస్తున్నాడు. విశేషం ఏంటంటే.. ఈ పిల్లాడి చేష్టల గురించి యాంకర్‌కు ఏ మాత్రం తెలియదు. ఈ సంఘటన యూకేలోని సౌత్‌ షీల్డ్స్‌లోని ఓ బీచ్‌లో చోటు చేసుకుంది. (రాజీవ్‌ గుప్తాకు యూకే ప్రధాని ప్రశంస)

వివరాలు.. బీబీసీ ప్రజెంటర్‌ జెన్‌ బార్ట్రామ్ లైవ్‌లో రిపోర్టింగ్‌ చేస్తున్నారు. ఇది గమనించి లియోగా అనే ఓ పిల్లాడు లైవ్‌ టెలికాస్ట్‌ జరుగుతుండగా.. యాంకర్‌ వెనక చేరి.. పిల్ల చేష్టలు చేయడం ప్రారంభించాడు. షర్ట్‌ పైకి లేపి.. డ్యాన్స్‌ కూడా చేశాడు. అయితే దీని గురించి జెన్‌కు ఏ మాత్రం తెలియదు. యాంకర్‌ రిపోర్టింగ్‌తో పాటు లియోగా చిలిపి చేష్టలు కూడా రికార్డయ్యాయి. ఆ తర్వాత వీడియో చూసి ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు లియోగా చిలిపి చేష్టలకు తెగ నవ్వుకుంటున్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు