Nigeria Explosion: ఆయిల్‌ రిఫైనరీలో భారీ ప్రమాదం.. 100 మంది కార్మికుల మృతి

24 Apr, 2022 14:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్మిషన్‌ లేకుండా నిర్వహిస్తున్న చమురు శుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. నైజీరియాలోని దక్షిణ రాష్ట్రమైన ఇమోలోని చమురు శుద్ధి కర్మాగారంలో ఈ దుర్ఘటన జరిగింది. సుమారు 100 మందికిపైగా కార్మికులు ప్రమాదంలో మరణించినట్టు తెలుస్తోంది. చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు సంభవించడం వల్లే ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న ఆయిల్‌ రిఫైనరీ నిర్వాహకుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. 
చదవండి👉🏼 58 ఏళ్ల తర్వాత ఫేస్‌బుక్‌ చేసిన మేలు

కాగా, ఆఫ్రికాలో అతిపెద్ద ఆయిల్‌ ఉత్పత్తిదారు అయిన నైజీరియాలో అనుమతిలేకుండా చమురు శుద్ధి కర్మాగారాలను నిర్వహించడం మామూలే! పైప్‌ లైన్ల నిర్వహణ లోపాల కారణంగా ప్రమాదాలు సాధరణమైపోయాయి. ఆయిల్‌ దొంగలు కూడా రిఫైనరీల పైప్‌లైన్లను ధ్వంసం చేసి భారీ ఎత్తున పెట్రోల్‌, డీజిల్‌ను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. ఈక్రమంలో ప్రమాదాలు జరిగి వందలాది అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఆయిల్‌ దందాలో అక్రమాలకు అడ్డుకట్టు వేసేందుకు మిలటీరిని రంగంలోకి దించామని, పటిష్ట చర్యలు చేపడుతున్నామని నైజీరియా ప్రభుత్వం చెబుతోంది. రోజూ 2 మిలియన్ల బ్యారెల్స్‌ చమురు ఉత్పత్తి చేస్తున్న నైజీరియాలో మెజారిటీ ప్రజలు బీదరికంలో మగ్గుతుండటం గమనార్హం.
చదవండి👉 మొట్టమొదటిసారిగా.. యూఎస్‌లో పోర్నోగ్రఫీపై కోర్సు

మరిన్ని వార్తలు