చైనాతోనే అమెరికాకు ముప్పు: నిక్కీ హేలీ

25 Oct, 2020 11:14 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రచారంలో భాగంగా చైనాతోనే అగ్రరాజ్యం అమెరికాకు నంబర్‌ వన్‌ ముప్పని భారత్‌-అమెరికా రిపబ్లికన్‌ రాజకీయ నాయకురాలు నిక్కీహేలీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్ తరపున భారత్‌-అమెరికా మాజీ రాయబారి హేలీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా యుద్ధ భూమియైన ఫిలడెల్పియాలో ఇండియన్‌ వాయిసెస్‌ ఫర్‌ ట్రంప్‌ పేరుతో శనివారం ఏర్పాటు చేసిన సభలో హేలీ మాట్లాడుతూ... బీజింగ్,‌ అమెరికా మేధో శక్తిని దొంగలించకుండా ట్రంప్‌ చూశారన్నారు. ట్రంప్‌ చైనాను దృష్టిలో పెట్టుకోవడం వల్లే డ్రాగన్‌ ఉచ్చులో అమెరికా పడలేదన్నారు. ప్రస్తుతం చైనా నుంచి అమెరికాకు తీవ్ర స్థాయిలో జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందన్నారు. చైనాతో జరిగిన ఒప్పందంలో ట్రంప్‌ ఉత్తమైన వాణిజ్య ఒప్పందం పొందడమే కాకుండా, మేధో సంపత్తితో చైనాను దృష్టిలో పెట్టుకున్నారని హేలీ వ్యాఖ్యానించారు. (చదవండి: షాకింగ్‌‌: బైడెన్‌ని హత్యచేయాలనుకున్నాడు)

ప్రస్తుతానికి చైనా మన మేధో శక్తిని దొంగలించకుండా చూసినా.. భవిష్యత్తులో మనమంతా చైనాకు జవాబుదారితనంగా ఉండొచ్చని ఆమె హెచ్చరించారు. అయితే కరోనా వైరస్‌ కారణంతో పాటు, ఇండో పసిఫిక్‌, హాంకాంగ్, వాణిజ్య ఒప్పందాల కారణంగా చైనా-అమెరికా సంబంధాలు క్షీణించాయి. అనంతరం హేలీ డెమొక్రాటిక్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి జో బిడెన్‌పై ఆమె విరుచుకుపడ్డారు. అదే విధంగా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పరిపాలనపై కూడా ఈ సందర్బంగా విమర్శలు గుప్పించారు. ఒబామా పరిపాలన ఉగ్రవాదానికి పోషణగా ఉందని ఆమె ఆరోపించారు. ‘బిడెన్‌ ఆధ్వర్యంలోని గత పాలనలో మిలియన్‌ డాలర్‌లతో నిండిన విమానాలను ఒబామా ఉగ్రవాదాని పోషించేందుకు స్పాన్సర్‌ చేశారన్నారు. ఆ నగదుతో యెమెన్‌, లెబనాన్‌, సిరియా, ఇరాక్‌ అంతటా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌ 3న అమెరికాలో అధ్యక్షలు ఎన్నికలు జరగనున్నాయి. (చదవండి: సరిహద్దు సమస్యను గమనిస్తున్నాం!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు