నిత్యానంద మరో సంచలన నిర్ణయం..!

22 Apr, 2021 18:21 IST|Sakshi

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరో సంచలన ప్రకటన చేశారు. కరోనా విజృంభించడంతో పలు దేశాలు భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై తాత్కాలికంగా నిషేధ్ఙాలు విధించిన విషయం తెలిసిందే. మేము ఏమైనా తక్కువ తిన్నామా! అంటూ ఆధ్యాత్మిక గురువు నిత్యానంద తమ దేశానికి(కైలాస) వచ్చే భారతీయులపై నిషేద్ఙాలు విధించారు. అంతేకాకుండా బ్రెజిల్‌, యూరప్‌ దేశాలు, మలేషియా దేశాలపై నిషేధాలు విధించారు. నిత్యానంద తాజా ప్రకటనలో, "కైలాసియన్లు, ఎకైలాసియన్లు, ఈ దేశ రాయబార కార్యాలయాలతో సంబంధం ఉన్న వాలంటీర్లు క్వారంటైన్‌లో ఉండాలని తెలిపారు. ఈ ఆదేశాలను చూసి సోషల్‌ మీడియాలో నెటిజన్లు నవ్వుకుంటున్నారు. 

కాగా, నిత్యానంద ఈక్వెడార్‌లోని  ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, అందులో ‘కైలాస’ అనే  దేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ దేశంలో ప్రత్యేక కరెన్సీను కూడా రిలీజ్‌ చేశాడు.  పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద భారత్‌ నుంచి పారిపోయినా విషయం తెలిసిందే.

చదవండి: నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నా! 

మరిన్ని వార్తలు